https://oktelugu.com/

IPL 2024: బ్యాట్ తో వీర విహారం.. బంతితో మాయాజాలం.. ఇప్పటికైతే ఐపీఎల్ హీరోలు వీరే

ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 316 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడి తర్వాత రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ 261 పరుగులతో రెండవ స్థానాన్ని ఆక్రమించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 11, 2024 / 07:02 PM IST

    IPL 2024

    Follow us on

    IPL 2024: ఐపీఎల్ జోరుగా సాగుతోంది. జట్లన్నీ హోరాహోరీగా ఆడుతున్నాయి. అండర్ డాగ్ గా పేరొందిన ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ చూపుతున్నారు. అటు బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తుంటే.. ఇటు బంతితో మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.. ఇప్పటివరకు పది జట్ల మధ్య 24 మ్యాచ్ లు జరిగాయి. రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడింది. ఒక్క ఓటమి మినహా మిగతా అన్నింటిలో గెలిచింది.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ 4 మ్యాచ్ లు అడగా.. మూడు విజయాలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టు నాలుగు మ్యాచ్లు ఆడి.. మూడు విజయాలతో మూడవ స్థానంలో నిలిచింది. చెన్నై జట్టు ఐదు మ్యాచ్లు ఆడి మూడు విజయాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ జట్టు ఐదు మ్యాచ్లు ఆడి మూడు విజయాలు సాధించి 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టుకు నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల చెన్నై తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. ఇక గుజరాత్ 6, పంజాబ్ ఏడు, ముంబై ఎనిమిది, బెంగళూరు 9, ఢిల్లీ జట్టు పదవ స్థానాల్లో కొనసాగుతున్నాయి.

    ఇంకా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 316 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడి తర్వాత రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ 261 పరుగులతో రెండవ స్థానాన్ని ఆక్రమించాడు. గుజరాత్ కెప్టెన్ గిల్ 255 పరుగులతో మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 246 పరుగులతో రాజస్థాన్ కెప్టెన్ సంజు నాలుగవ స్థానంలో, 226 పరుగులతో గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటికైతే ఆరెంజ్ క్యాప్ విభాగంలో ఈ ఐదుగురు పోటీ పడుతున్నారు.

    ఇక బౌలింగ్ విభాగానికి వస్తే రాజస్థాన్ బౌలర్ చాహల్ పది వికెట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు . చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ 9 వికెట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. పంజాబ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ఎనిమిది వికెట్లతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ 8 వికెట్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడి ఎకానమీ రేటు అర్ష్ దీప్ తో పోలిస్తే ఎక్కువగా ఉండడంతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 7 వికెట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 17వ సీజన్లో 24 మ్యాచ్లు జరిగాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే జట్లు ఆల్ అవుట్ అయ్యాయి.. అందువల్లే బౌలర్లు ఈసారి ఎక్కువగా వికెట్లు తీయలేకపోతున్నారు.