https://oktelugu.com/

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పది జట్ల కెప్టెన్లు వీరే

హైదరాబాద్ జట్టుకు గత ఏడాది సీజన్ కు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఐడెన్ మార్ క్రమ్ కొనసాగాడు. ఈసారి కూడా అతడే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఐడెన్ మార్ క్రమ్ 2021 ఐపిఎల్ సీజన్లో పంజాబ్ జట్టుకు ఆడాడు.

Written By: , Updated On : March 1, 2024 / 04:27 PM IST
IPL 2024
Follow us on

IPL 2024: ప్రతి ఏడాది వేసవిలో వీనుల విందైన క్రికెట్ వినోదాన్ని అందించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఫ్రాంచైజీలకు ఓనర్లుగా ఉన్న నేపథ్యంలో ఈసారి మ్యాచ్ లు హోరా హోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ వేదికగా జరిగే 17వ ఎడిషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి హేమాహేమీలాంటి ఆటగాళ్లు అన్ని జట్లకు ఉండటంతో టోర్నీ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. పైగా పలు జట్లకు కెప్టెన్లు మారారు. కొంతమంది ఆటగాళ్లు కూడా మారారు. ఈ నేపథ్యంలో ఏఏ జట్లకు ఎవరెవరు సారథ్యం వహిస్తున్నారో ఒక్కసారి పరిశీలిస్తే..

హైదరాబాద్ జట్టుకు గత ఏడాది సీజన్ కు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఐడెన్ మార్ క్రమ్ కొనసాగాడు. ఈసారి కూడా అతడే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఐడెన్ మార్ క్రమ్ 2021 ఐపిఎల్ సీజన్లో పంజాబ్ జట్టుకు ఆడాడు. అయితే ఇతడి ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు గ్రూపు దశ కూడా దాటలేదు. ఇతడి మార్పు అనివార్యం అనుకుంటున్న దశలో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. అతడి వైపే ఈ సీజన్లోనూ ఆమె మొగ్గింది.

బెంగళూరు జట్టుకు గత ఏడాది కెప్టెన్ గా డూప్లెసిస్ కొనసాగాడు. అయితే ఈసారి కూడా అతడే కెప్టెన్ గా ఉంటాడని తెలుస్తోంది. దూకుడయిన ఆట తీరు ప్రదర్శించే డుప్లెసిస్.. గత సీజన్ లో మెరుపులు మెరిపించాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈసారి కూడా మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది ట్రోఫీ దక్కించుకున్న ఈ జట్టు ఈ సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెడుతోంది. ఈసారి కూడా జట్టుకు టైటిల్ అందిస్తే ధోని ఖాతాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనే ఘనత చేరుతుంది.

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించబోతున్నాడు. గత సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ చేయడం పట్ల రోహిత్ శర్మతో పాటు అతని అభిమానులు కూడా ఆగ్రహం గా ఉన్నారు. అయితే జట్టు అవసరాల కారణంగా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా తీసుకున్నామని ఇప్పటికే ముంబై ఇండియన్స్ యాజమాన్యం ప్రకటించింది.

లక్నో జట్టు కెప్టెన్ గా ఈసారి కూడా రాహుల్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది రాహుల్ ఆధ్వర్యంలో లక్నో ఆశించినంత స్థాయిలో ప్రదర్శన కొనసాగించలేదు. అయినప్పటికీ అతడి వైపే మేనేజ్మెంట్ ఆసక్తి చూపిస్తోంది.

కోల్ కతా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నియమితుడయ్యాడు. గత ఏడాది సీజన్లో నితీష్ రానా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈసారి అతడి స్థానంలో అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గతంలో కోల్ కతా జట్టును ఫైనల్ చేర్చిన ఘనత అయ్యర్ కు ఉంది.

హార్దిక్ పాండ్యా ను ముంబై జట్టు కెప్టెన్ గా నియమించిన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా టీమిండియా యువ సంచలనం శుభ్ మన్ గిల్ వ్యవహరించనున్నాడు. కెప్టెన్ గా అతడికి ఇదే తొలి అవకాశం. మరి ఈసారి అతడు మెరిపించే మెరుపుల ఆధారంగానే జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది.

పంజాబ్ జట్టు కెప్టెన్ గా శిఖర్ ధావన్ కొనసాగనన్నాడు. గత సీజన్లో డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్నాడు. రిషబ్ పంత్ కోలుకోవడంతో.. అతడు పంజాబ్ జట్టులో ఆడనున్నాడు. అతడి రాక నేపథ్యంలో డేవిడ్ వార్నర్ ను తప్పించారు.

ఇక రాయస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా సంజూ శాంసన్ కు బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు గత ఏడాది ఆశించినంత స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. ఆ జట్టు పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం సంజూ పై నమ్మకం ఉంచి అతడికి కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.