https://oktelugu.com/

Sakshi: రంగు మార్చిన సాక్షి..

సాక్షి ఛానల్ కు ప్రారంభ నుంచి నిన్నటి వరకు ఒకే తీరైన గ్రాఫిక్ డిజైన్ లో ప్రదర్శితమయ్యేది. ఎరుపు, పసుపు, నలుపు రంగుల సమ్మేళితమైన మిశ్రమంతో రూపొందించిన గ్రాఫిక్ హెడ్ కంటెంట్ లో సాక్షి లోగో కనిపించేది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 1, 2024 4:34 pm
    Sakshi
    Follow us on

    Sakshi: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ పత్రిక సాక్షి రంగు మార్చింది.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. సాక్షి పత్రికకు అనుబంధంగా సాక్షి ఛానల్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.. ప్రస్తుతం సాక్షి గ్రూపు సంస్థలకు చైర్ పర్సన్ గా వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి వ్యవహరిస్తున్నారు. సాక్షి పత్రిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 26 ఎడిషన్ లతో ప్రారంభమైంది. ఆ తర్వాత సాక్షి ఛానల్ కూడా పూర్తి హెచ్ డీ క్వాలిటీ తో ప్రసారాలు ప్రారంభించింది. అయితే ఈ పత్రిక, చానల్ ఏర్పాటు వెనుక ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ.. తెలుగు నాట సాక్షి పత్రిక ఈనాడు తర్వాతి స్థానంలో కొనసాగుతోంది.. సాక్షి ఛానల్ ఏడు లేదా ఎనిమిది స్థానాలలో ఉంది.

    సాక్షి ఛానల్ కు ప్రారంభ నుంచి నిన్నటి వరకు ఒకే తీరైన గ్రాఫిక్ డిజైన్ లో ప్రదర్శితమయ్యేది. ఎరుపు, పసుపు, నలుపు రంగుల సమ్మేళితమైన మిశ్రమంతో రూపొందించిన గ్రాఫిక్ హెడ్ కంటెంట్ లో సాక్షి లోగో కనిపించేది. ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ ప్రదర్శితమయ్యేది. కానీ ఏపీ ఎన్నికలకు ముందు సాక్షి ఒక్కసారిగా తన రంగు మార్చింది. వైఎస్ఆర్సిపి అధికారిక రంగు అయినటువంటి నీలంలోకి సాక్షి లోగో మారిపోయింది.

    నీలం రంగు బ్యాక్ గ్రౌండ్ లో.. తెలుపు అక్షరాలతో సాక్షి లోగో కనిపిస్తోంది. అలాగే సాక్షి డిజిటల్ డిస్ప్లే కూడా పూర్తిగా నీలం రంగులోకి మారిపోయింది. అయితే ఇన్ని సంవత్సరాలు మార్చలేనిది.. ఇప్పుడే ఎందుకు మార్చారు అనే సందేహాలు వీక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోక ముందు సాక్షి డిజిటల్ లోగో మాత్రమే డిస్ప్లే అయ్యేది. ఆయన చనిపోయిన తర్వాత డిస్ప్లే లోగోలో రాజశేఖర్ రెడ్డి ఫోటో జత చేయడం ప్రారంభించారు. అయితే ఇన్నాళ్లకు సాక్షి ఛానల్ రంగు మార్చడం పట్ల రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎలాగూ పార్టీ ఛానల్ కాబట్టి.. పార్టీ జెండాలోని ఒక రంగును దానికి వాడారని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది నీలం అనేది ప్రశాంతతకు నిదర్శనం కాబట్టి దానిని ఉపయోగించారని చెబుతున్నారు. అయితే రంగు మార్పు పట్ల సాక్షి యాజమాన్యం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అన్నట్టు సాక్షి చానల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పూర్తిగా మార్చారు.