Lakshadweep: సరిగ్గా గత ఏడాది చివర్లో లక్షద్వీప్ ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. ఆ సమయంలో స్కూబా డైవింగ్ చేశారు. ఆ తర్వాత దేశంలోని ప్రజలు తమ సాహసవంతమైన విహారయాత్ర జాబితాలో లక్షద్వీప్ ప్రాంతాన్ని కూడా చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో మాల్దీవుల మంత్రులు దానిపై స్పందించడం.. ఆ తర్వాత దేశ ప్రజలు లక్షద్వీప్ వైపు మళ్లడం చకా చకా జరిగిపోయాయి. అయితే అప్పట్లో చాలామంది లక్షద్వీప్ ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్నారో అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది కేవలం పర్యాటకం అనే కోణంలో మాత్రమే చూశారు. కానీ మోడీ లక్షద్వీప్ ప్రాంతం పై ప్రత్యేకంగా దృష్టి సారించడానికి కారణం వేరే ఉంది.
వాస్తవానికి లక్షద్వీప్ ప్రాంతం హిందూ సముద్రంలో ఉంటుంది. చాలావరకు దేశానికి సంబంధించిన వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణ సాగిస్తుంటాయి. చైనాకు కూడా ఈ సముద్ర మార్గం అత్యంత కీలకం. సరుకు రవాణాకు సంబంధించి మిగతా ప్రాంతాలలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు చైనా ఈ ప్రాంతం మీదుగానే తన దేశం మీదకు నౌకలు మళ్లించుకుంటుంది. అత్యంత సున్నితమైన ఈ ప్రాంతం మీద గత ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించలేదు. పైగా అంతర్జాతీయ వేదికల మీద మన దేశం పట్ల విషయాన్ని చిమ్ముతున్న చైనాకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పాలి అంటే అది కేవలం లక్షద్వీప్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నరేంద్ర మోడీ భావించారు. అందుకే ముందుగా ఈ ప్రాంతాన్ని విపరీతంగా ప్రమోట్ చేశారు. ఎప్పుడైతే మాల్దీవుల మంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారో అప్పుడే లక్షద్వీప్ ఒక్కసారిగా దర్శనీయ ప్రాంతం గా మారిపోయింది. ఇదే తడవుగా కేంద్రం కూడా ఇక్కడ ఇండియన్ నేవీ స్థావరం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో బాగానే పనులు మొత్తం పూర్తి చేస్తుంది. ఇక్కడ ఏర్పాటుచేసిన ఐ ఎన్ ఎస్ జటాయు స్థానాన్ని వచ్చే వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇక్కడ ఐ.ఎన్.ఎస్ స్థావరం ఏర్పాటు చేయడం ద్వారా ఈ మార్గంలో మన దేశానికి పట్టు ఉంటుంది. చైనా లాంటి దేశాన్ని మన గ్రిప్ లో పెట్టుకునేందుకు అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలను ఇక్కడి నుంచి పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు సబ్ మెరైన్లు, యుద్ధనౌకలు కూడా ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తాయి..
మిగతా సముద్ర మార్గాల్లో అవాంతరాలు ఎదురైనప్పుడు చైనా ఈ ప్రాంతం మీదుగా తన దేశంలోకి వివిధ రకాలైన నౌకలను మళ్లించుకుంటుంది. అలాంటప్పుడు ఈ ప్రాంతం మీద పూర్తిస్థాయిలో పట్టు కలిగి ఉంటే చైనా కూడా మన మాట వింటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన. అందుకే ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరిగాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యాయి. ఇక ఇక్కడ స్థావరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం మీద మన దేశానికి పూర్తిస్థాయిలో పట్టు చిక్కినట్టే. చైనా మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాలు కూడా మనం చెప్పినట్టు వింటాయి. ఎందుకంటే ఆయా దేశాలకు వెళ్లే వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. మొన్నటిదాకా లక్షద్వీప్ అనేది ఒక సముద్ర తీర ప్రాంతం. కొంతకాలానికి అది పర్యాటక ప్రాంతం అయింది. కానీ ఇప్పుడు మన దేశానికి సంబంధించి అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ జటాయు స్థావరమైంది. అన్నట్టు ఈ జటాయు స్థావరం మాల్దీవులకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.. అంటే ఆ ప్రాంతంలో జరిగే ప్రతి విషయాన్ని ఇక్కడి నుంచే పరిశీలించే అవకాశం ఉంటుంది. చైనాకు దగ్గరై మన మీద రకరకాల కుట్రలకు శ్రీకారం చుట్టిన మాల్దీవులకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ విధంగా బుద్ధి చెబుతున్నారన్నమాట..