IPL 2024  playoffs : మూడు బెర్తుల కోసం ఆరు జట్ల పోటీ.. వాటి అవకాశాలెలా ఉన్నాయంటే..

అప్పుడు చెన్నై బెంగళూరు మ్యాచ్ నాకౌట్ లాగా రూపాంతరం చెందుతుంది. చెన్నైతో తలపడే మ్యాచ్లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసి 18 పరుగుల తేడాతో.. రెండవసారి ఆడితే 18.1 ఓవర్లలో చేదిస్తే.. కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్తుంది.

Written By: NARESH, Updated On : May 14, 2024 6:09 pm

ipl-2024-playoff-scenarios

Follow us on

IPL 2024  playoffs : ఐపీఎల్ ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే కోల్ కతా ప్లే ఆఫ్ అవకాశాన్ని దక్కించుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. 2022లో ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్, ఐదుసార్లు విజేతగా ఆవిర్భవించిన ముంబై లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. పంజాబ్ జట్టు కూడా వాటి దారినే అనుసరించింది.. ఈ నేపథ్యంలో మిగతా మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.. ఇంతకీ వేటి పరిస్థితి ఎలా ఉందంటే..

రాజస్థాన్

ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్.. 8 విజయాలు దక్కించుకుంది. 12 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు బుధవారం పంజాబ్.. చివరి మ్యాచ్ కోల్ కతా తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లలో రాజస్థాన్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలుస్తుంది. ఒకవేళ పంజాబ్ పై గెలిచి, కోల్ కతా చేతిలో ఓడిపోతే.. నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్ వెళుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్లు ఓడిపోతే.. అప్పుడు కూడా మిగతా జట్ల ఫలితాల పై ఈ జట్టు ప్లే ఆఫ్ ఆశలు ఆధారపడి ఉంటాయి.

హైదరాబాద్

హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఏడు విజయాలు దక్కించుకుంది. ఆ జట్టు గుజరాత్, పంజాబ్ తో చివరి రెండు మ్యాచ్లు ఆడుతుంది. వీటిపై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ వెళ్తుంది.. ప్రస్తుతం హైదరాబాద్ +0.406 నెట్ రన్ రేట్ కొనసాగిస్తోంది. ఈ రెండు మ్యాచ్లలో ఒకటి గెలిచినా ఆ జట్టు ముందంజ వేస్తుంది. ఒకవేళ రెండు మ్యాచ్లు ఓడిపోతే మిగతా జట్ల ఫలితాలపై ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

చెన్నై

ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై 13 మ్యాచ్ లు ఆడింది. ఏడింట్లో నెగ్గింది. బెంగళూరు జట్టుతో తన చివరి మ్యాచ్ ఆడుతోంది. ఒకవేళ ఆ మ్యాచ్లో గెలిస్తే చెన్నై ప్లే ఆఫ్ వెళ్తుంది. ప్రస్తుతం మా జట్టుకు +0.528 నెట్ రన్ రేట్ ఉంది. బెంగళూరు తో గెలిస్తే ఇతర మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ బెంగళూరు చేతిలో ఓడిపోతే, అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై చెన్నై జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

లక్నో

లక్నో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. ఆరు విజయాలు అందుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో ఈ జట్టు చాలా వెనుకబడి ఉంది. పైగా ఇటీవల మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. దీంతో ఈ జట్టు ఢిల్లీ, ముంబైలతో తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లు గెలిస్తే.. లక్నో జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు కొంతమేర సజీవంగా ఉంటాయి. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు తమ తదుపరి మ్యాచ్లు ఓడిపోతే ఈ జట్టు ప్లే ఆఫ్ వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ ఈ జట్టు ఢిల్లీ తో జరిగే మ్యాచ్లో ఓడిపోతే కథ సుఖాంతం అవుతుంది.

ఢిల్లీ

ఢిల్లీ జట్టు 13 మ్యాచులు ఆడి.. ఆరు విజయాలు నమోదు చేసుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఇటీవల ఈ జట్టు బెంగళూరు చేతిలో దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు తను ఆడే చివరి రెండు మ్యాచ్లను కచ్చితంగా గెలవాల్సి ఉంది. ముఖ్యంగా మంగళవారం లక్నో జట్టుతో ఢిల్లీ తలపడుతోంది. ఈ మ్యాచ్లో ఒకవేళ ఢిల్లీ పడిపోతే ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా వదులుకోవాల్సిందే.

బెంగళూరు

ఐపీఎల్ లో బెంగళూరు ప్రయాణం గోడకు కొట్టిన బంతిలాగా సాగుతోంది. తొలి స్పెల్ లో ఎనిమిది మ్యాచ్లలో ఏడు ఓడిపోయింది. ఆ తర్వాత అనూహ్యంగా ఐదు మ్యాచ్లలో నెగ్గింది. ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. బెంగళూరుకు +0.387 నెట్ రన్ రేట్ ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో జట్లలో ఒకటి మాత్రమే ముందంజలో ఉండి.. మిగతా వినిశ్రమిస్తే బెంగళూరుకు ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. అప్పుడు చెన్నై బెంగళూరు మ్యాచ్ నాకౌట్ లాగా రూపాంతరం చెందుతుంది. చెన్నైతో తలపడే మ్యాచ్లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసి 18 పరుగుల తేడాతో.. రెండవసారి ఆడితే 18.1 ఓవర్లలో చేదిస్తే.. కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్తుంది.