https://oktelugu.com/

GV Prakash : విడాకులకు సిద్ధమైన ప్రముఖ సంగీత దర్శకుడు

ఇక జీవి ప్రకాష్ పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించాడు. నెక్స్ట్ నితిన్ - వెంకీ కుడుముల కాంబోలో విడుదల అవుతున్న చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. నటుడిగా కూడా పలు చిత్రాలు చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2024 / 06:05 PM IST

    Popular music director GV Prakash is ready for divorce

    Follow us on

    GV Prakash : ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ విడాకుల ప్రకటన చేశాడు. భార్య సైంధవితో విడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన వైరల్ గా మారింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అయిన జీవీ ప్రకాష్ నటుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. 2008లో విడుదలైన కుచేలన్ మూవీతో ఆయన వెండితెరకు పరిచయం అయ్యాడు. ఓ పాటలో జీవీ ప్రకాష్ కుమార్ నటించాడు. అనంతరం హీరోగా మారాడు. అదే సమయంలో ఆయన సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు.

    కాగా జీవీ ప్రకాష్ విడాకుల ప్రకటన చేశారు. ఆయన 2013లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. జీవి ప్రకాష్ భార్య పేరు సైంధవి. ఈమె జీవీ ప్రకాష్ క్లాస్ మేట్ అని సమాచారం. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 2020లో వీరికి ఒక అమ్మాయి పుట్టింది. అన్యోన్యంగా మెలుగుతున్న ఈ జంట విడాకుల ప్రకటన షాక్ గురి చేసింది.

    జీవీ ప్రకాష్… నేను సైంధవి 11 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నాము. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. మానసిక ప్రశాంత, జీవితంలో ఎదగాలని పరస్పరం అవగాహనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి కీలక సమయంలో మా గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకు మీకు తెలియజేస్తున్నాము. మమ్మల్ని అర్థం చేసుకొని మద్దతుగా ఉంటారని భావిస్తున్నాము… అని తెలియజేశాడు.

    జీవీ ప్రకాష్ కుమార్ ప్రకటన చర్చకు దారి తీసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా తలెత్తాయా? ఎందుకు విడిపోతున్నారనే చర్చ మొదలైంది. ఇక జీవి ప్రకాష్ పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించాడు. నెక్స్ట్ నితిన్ – వెంకీ కుడుముల కాంబోలో విడుదల అవుతున్న చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. నటుడిగా కూడా పలు చిత్రాలు చేస్తున్నారు.