IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అద్భుత రికార్డ్.. ముంబై, చెన్నై వల్లే కానిది ఈ జట్టు చేసింది

గురువారం రాత్రి అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 199 రన్స్ చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 5, 2024 11:13 am

GT vs PBKS IPL 2024 Highlights

Follow us on

IPL 2024: వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడింది. ఇంకేముంది విమర్శలు మొదలయ్యాయి. ఈసారి కూడా పంజాబ్ జట్టు దారుణమైన ఆట ప్రదర్శిస్తోందని చీత్కరింపులు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ శిఖర్ ధావన్ సేన అద్భుతమైన విజయం సాధించింది. గుజరాత్ జట్టుతో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో చివరికి విజయం సాధించి.. హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకుంది. ఆడిన నాలుగు మ్యాచ్లలో రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టిక ఐదవ స్థానంలో నిలిచింది.

గురువారం రాత్రి అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 199 రన్స్ చేసింది. కెప్టెన్ గిల్ 48 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 89 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. సాయి సుదర్శన్, కెన్ విలియంసన్, రాహుల్ తేవాటియ వంటి వారు కూడా తమ వంతు పాత్ర పోషించడంతో గుజరాత్ జట్టు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు మరొక బంతి మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. వరుసగా రెండు ఓటమిలో ఎదుర్కొన్న తర్వాత.. గుజరాత్ జట్టును వారి సొంత గడ్డపై పంజాబ్ ఓడించడం విశేషం. ముఖ్యంగా స్లాగ్ ఓవర్స్ లో పంజాబ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు.

ఈ మ్యాచ్లో శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, అశుతోష్ రాణా, దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఈ ముగ్గురి వల్లే పంజాబ్ జట్టు విజయం సాధించింది. శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 24 బంతుల్లో 35, అశుతోష్ రాణా 17 బంతుల్లో 31 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ మ్యాచ్లో గెలుపు ద్వారా పంజాబ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 200 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ చేదించిన తొలి జట్టుగా ఘనత సాధించింది. మొత్తంగా ఆరుసార్లు 200 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ చేజ్ చేసిన జట్టుగా నిలిచింది. 17 సంవత్సరాల ఐపీల్ చరిత్రలో ఇతర ఘనత సాధించింది కేవలం పంజాబ్ జట్టు మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా చెన్నై, ముంబై కి పేరు ఉంది. కానీ ఈ జట్లు ఇప్పటివరకు ఇలాంటి రికార్డును అందుకోలేకపోయాయి. 17 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా విజేతగా నిల్వక పోయినప్పటికీ పంజాబ్ ఈ అరుదైన ఘనత సాధించింది.