https://oktelugu.com/

YS Avinash Reddy : అవినాష్ రెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

సాక్షులను ప్రభావితం చేసినట్లు సిబిఐ వద్ద బలమైన రుజువులు ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈనెల 18న నామినేషన్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతకుముందు అంటే.. 15న కోర్టులో సాక్షులను ప్రభావితం చేసిన రుజువులు చూపించగలిగితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈనెల 15న కోర్టులో ఏం జరగబోతుందో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : April 5, 2024 / 11:15 AM IST

    YS Avinash Reddy's bail may be canceled

    Follow us on

    YS Avinash Reddy : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ట్విస్ట్. ఈ కేసులో ఒక నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ గట్టిగా వాదిస్తోంది. దస్తగిరి వేసిన పిటీషన్ ను పూర్తిస్థాయిలో సమర్ధించింది. ఆయన సాక్షులను బెదిరిస్తున్నారని.. తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొస్తోంది. సాధారణంగా బెయిల్ ఇచ్చిన వ్యక్తికి కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంది. సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని ముందుగానే హెచ్చరిస్తుంది. ఇప్పుడు సీబీఐ అదే వాదనలు వినిపిస్తోంది. సాక్షులను ప్రభావితం చేశారన్న రుజువులు ఉన్నాయని చెబుతుండడంతో అవినాష్ బెయిల్ రద్దయిన ఆశ్చర్యపోనవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

    వివేక హత్య కేసు విచారణలో సిబిఐ వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసి.. ఒక్క అవినాష్ రెడ్డికి మాత్రం మినహాయింపు ఇవ్వడం పై అనేక విమర్శలు వచ్చాయి. ఒకానొక దశలో సిబిఐ చర్యలపై ముప్పేట ఆరోపణలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సిబిఐ పట్టు బిగించడం విశేషం. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సిబిఐకి రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించలేదు. పైగా సిబిఐ అధికారులపైనే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని.. అందుకే సిబిఐ ఉపేక్షించే పరిస్థితి ఉండదన్న వాదన వినిపిస్తోంది. అందుకే దస్తగిరి వేసిన అవినాష్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను సిబిఐ సంపూర్ణంగా సమర్ధించింది.

    ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య సైతం ఒక హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే వైయస్ షర్మిల తో పాటు సునీత నేరుగా జగన్ ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు జగన్ సైతం తన ఎన్నికల ప్రచార సభలో వివేక హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ని పక్కన పెట్టుకునే.. ఈ హత్య విషయమై మాట్లాడుతుండడంతో మరింత సంచలనం రేకెత్తిస్తోంది. మరోవైపు దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది. సాక్షులను ప్రభావితం చేసినట్లు సిబిఐ వద్ద బలమైన రుజువులు ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈనెల 18న నామినేషన్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతకుముందు అంటే.. 15న కోర్టులో సాక్షులను ప్రభావితం చేసిన రుజువులు చూపించగలిగితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈనెల 15న కోర్టులో ఏం జరగబోతుందో చూడాలి.