Health Tips: జంక్ ఫుడ్, చిప్స్ ప్యాకెట్ లు ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త

ఇలా ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఏకంగా ఇంగ్లాండుకు సంబంధించిన ఒక అబ్బాయి తన కంటిచూపును కోల్పోయాడు. 15 సంవత్సరాల వయసు ఉన్న ఈ అబ్బాయికి కంటిచూపు పోయింది.

Written By: Swathi, Updated On : April 5, 2024 11:06 am

Eating too much junk food and chips packets

Follow us on

Health Tips: ఒకప్పటి ఆహార అలవాట్లకు ఇప్పటి ఆహార అలవాట్లకు చాలా తేడా ఉంది. ప్రస్తుతం పిల్లలకు ఇచ్చే ఆహారం గురించి చాలా ఆలోచించాల్సిందే. కానీ ఏడుస్తున్నారు అని ఏది అడిగితే అది కొనిస్తుంటారు తల్లిదండ్రులు. వాటివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కొన్ని సార్లు దీర్ఘకాలిక సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఇక జంక్ ఫుడ్స్ కు ఇప్పటికే ఎంతో మంది పిల్లలు అలవాటు పడ్డారు. చాక్లెట్స్, బిస్కెట్స్, ముఖ్యంగా చిప్స్ ప్యాకెట్ అంటూ ఫుల్ గా తింటారు.

ఇలా ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఏకంగా ఇంగ్లాండుకు సంబంధించిన ఒక అబ్బాయి తన కంటిచూపును కోల్పోయాడు. 15 సంవత్సరాల వయసు ఉన్న ఈ అబ్బాయికి కంటిచూపు పోయింది. ముందుగా మసక మసకగా కనిపించడం తో డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లారు తల్లిదండ్రులు. అయితే విటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్పారు. దానికి సంబంధించిన మందులు ఇచ్చారు డాక్టర్. కానీ కొన్ని రోజులకు ఆ బాబుకు కంటి చూపు పోయింది.

మళ్లీ డాక్టర్ వద్దకు వెళితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు. కానీ రీసెర్చ్ చేసిన తర్వాత షాకింగ్ విషయాలు తెలిశాయట. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా?ఈ అబ్బాయి రోజు తినే ఫుడ్ లో చిప్ప్ పాకెట్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ సమస్య పెరిగిపోయిందట. కాల్షియం, విటమిన్స్ తగ్గిపోయాయట. దీనివల్ల ఆ అబ్బాయి కంటి నరాల పనితీరు మొత్తం డామేజ్ అయింది. దీనివల్ల కంటి చూపును కోల్పోయాడు. ముందుగా మసక మసక కనిపించి, ఆ తర్వాత పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు ఈ అబ్బాయి.

అయితే కొందరిలో వినికిడి శక్తి కూడా పోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే కచ్చితంగా దూరం పెట్టడం ముఖ్యం. అడిగారు కదా ఏడుస్తున్నారు కదా అని చిప్స్, కుర్ కురేలు ఇవ్వకండి. జంక్ ఫుడ్స్ కు మరింత దూరంగా ఉంచండి. లేదంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.