PBKS Vs MI: ఐపీఎల్ 17వ సీజన్లో గురువారం మరో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ముల్లాన్ పూర్ వేదికగా పంజాబ్, ముంబై జట్లు పోటీ పడనున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు 8,9 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మ్యాచ్ ఈ రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ప్లే ఆఫ్ వెళ్లాలంటే ఈ రెండు జట్లకు గెలుపనేది అత్యవసరం. బౌలింగ్ కు స్వర్గధామం లాంటి ఈ మైదానంపై టాస్ గెలిచిన వారే విజేతలవుతారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
పంజాబ్
ఈ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడింది. ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది. ఈ జట్టులో శిఖర్ ధావన్, శశాంక్ సింగ్ మాత్రమే రాణిస్తున్నారు.. బ్యాటింగ్ లో లివింగ్ స్టోన్, రిల్లే రో సౌ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, అశుతోష్ శర్మ, జితేష్ శర్మ వంటి వారు సత్తా చాటాల్సి ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన శిఖర్ 152 పరుగులు చేసి.. జట్టులో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. శశాంక్ సింగ్ 6 మ్యాచ్ లు ఆడి 146 పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు. రబాడా, అర్ష్ దీప్ సింగ్, సామ్ కరణ్ మీదే ఈ జట్టు బౌలింగ్ దళం ఆధారపడి ఉంది. మిగతావారు ధారాళంగా పరుగులిస్తున్నారు. అది ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. సికిందర్ రాజా, హర్ ప్రీత్ బ్రార్ వంటివారు తన లయను అందిపుచ్చుకోవాల్సి ఉంది.
ముంబై
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా ఉంది ముంబై జట్టు పరిస్థితి. మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నారు. అర్థం గా ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు ఊరికే చతికిల పడుతోంది. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి, రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇటీవల రెండు వరుస విజయాలు సాధించడంతో ట్రాక్ లో పడిందని అందరూ అనుకున్నారు. కానీ చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ముంబై మళ్ళీ వైఫల్యాల బాట పట్టింది. జట్టులో రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ మాత్రమే బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇతర ఆటగాళ్లు తమ లయ అందుపుచ్చుకోవాల్సి ఉంది. బౌలింగ్ బుమ్రా, కోయెట్జీ మాత్రమే రాణిస్తున్నారు. మిగతా బౌలర్ల కూడా రాణించాల్సి ఉంది.
ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 31 మ్యాచ్ లు ఆడగా పంజాబ్ 15 సార్లు, ముంబై 16 సార్లు విజయాలు సాధించాయి.
జట్ల అంచనా ఇలా
పంజాబ్
శిఖర్ ధావన్(కెప్టెన్), శశాంక్ సింగ్, సామ్ కరణ్, లివింగ్ స్టోన్, రొసౌ, అషుతోష్ శర్మ, హర్ ప్రీత్ భాటియా, జితేష్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో, విశ్వనాధ్ సింగ్.
ముంబై
హార్థిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, ఇషాన్ కిషన్, కొయేట్జీ, శ్రేయస్ గోపాల్, మహమ్మద్ నబి, టిమ్ డేవిడ్, డేవాల్డ్ బ్రేవిస్, షెఫర్డ్, ఆకాష్ మద్వాల్.
గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్ లో 54 శాతం ముంబై, 46 శాతం పంజాబ్ గెలిచే అవకాశాలున్నాయి.