Kashmir Lok Sabha Elections : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముఖచిత్రం ఓ కొలిక్కి

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముఖచిత్రం ఓ కొలిక్కి వచ్చింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 18, 2024 2:59 pm

Kashmir Lok Sabha Elections : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముఖచిత్రం రోజురోజుకు క్లారిటీ వస్తోంది.రేపు 19న ఉద్దంపూర్ లోక్ సభ ఎన్నిక జరుగబోతోంది. డా. జితేంద్రసింగ్ పోటీచేస్తున్నారు. గ్యారెంటీగా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఆ తర్వాత 26న జమ్మూలో జరుగుతాయి. కిషోర్ శర్మ కూడా ఈజీగా గెలిచేస్తారు. జమ్మూలో ఉన్న రెండు లోక్ సభ సీట్లు బీజేపీ ఖాతాలో పడడం గ్యారెంటీగా చెప్పొచ్చు. గెలిచే సీట్లు అవి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే పోటీ ఉంటుంది.పునర్విభజన తర్వాత బీజేపీకి గ్యారెంటీగా మారాయి.

శ్రీనగర్ వ్యాలీలోని మూడు నియోజకవర్గాల ఫలితంపై ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి కశ్మీర్ వ్యాలీలో ఒక్క సీటులో కూడా పోటీ చేయడం లేదు. జమ్మూలో మద్దతు తీసుకొని కశ్మీర్ వ్యాలీలో నేషనల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.

అనంతనాగ్, రాజోళికి నామినేషన్ 19వ తేదీనే చివరి తేదీ. కశ్మీర్ లోయలో పోటీపై బీజేపీ నిర్ణయం కోసం వేచిచూస్తోంది. కశ్మీర్ వ్యాలీలో పోటీ చేయకుండా ఎవరికో మద్దతు బీజేపీ ఇస్తుందని అర్థమవుతోంది.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముఖచిత్రం ఓ కొలిక్కి వచ్చింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.