: ఈ తరం వారికి తెలియదు కాని.. అంతకుముందు తరం వాళ్లకు దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు జాంటీ రోడ్స్ సుపరిచితుడే. ఒంట్లో ఎముకలు లేనట్టు.. సూపర్ మాన్ తనలో ఆవహించినట్టు.. స్పైడర్ మాన్ తనకేదో చుట్టమైనట్టు.. అమాంతం గాలిలో తేలిపోయేవాడు. తన వైపు బంతి వస్తే చాలు గోడలాగా అడ్డుపడేవాడు. ఎంత పెద్ద బ్యాటర్ అయినప్పటికీ సింగిల్ రన్ కూడా ఇచ్చేవాడు కాదు. పైగా రెప్పపాటులో రన్ అవుట్ చేసేవాడు. అందుకే ఇవాల్టికి ఫీల్డింగ్ గురించి ప్రస్తావనకు వస్తే జాంటీ రోడ్స్ గురించి ప్రత్యేకంగా చెబుతారు. ఫీల్డింగ్ లో అతడు నెలకొల్పిన ప్రమాణాలను అందుకోవడం నేటి తరం ఆటగాళ్లు ఒకింత కష్టమే. అయితే అంతటి జాంటీ రోడ్స్ ను ఓ బాల్ భాయ్ మెప్పించాడు. అద్భుతమైన క్యాచ్ పట్టి అతడి మనసును గెలుచుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా ఆదివారం రాత్రి లక్నో, కోల్ కతా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో కోల్ కతా ముందుగా బ్యాటింగ్ చేసి 235 రన్స్ చేసింది. 236 రన్స్ టార్గెట్ చేజ్ చేసే క్రమంలో లక్నో జట్టు ఇబ్బంది పడింది. 16.1 ఓవర్లలో 137 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. దీంతో కోల్ కతా జట్టు 98 రన్స్ తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో కోల్ కతా జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్ళింది.
లక్నో ఇన్నింగ్స్ సమయంలో.. ఆ జట్టు బ్యాటర్ స్టోయినీస్ భారీ షాట్ కొట్టాడు. అతడు కొట్టిన దెబ్బకు బంతి గాలిలో తేలిపోయింది. ఆ బంతిని బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ భాయ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు.. లక్నో జట్టు ఇన్నింగ్స్ సమయంలో వైభవ్ అరోరా మూడో ఓవర్లో వేసిన ఐదవ బంతిని స్టోయినీస్ గట్టిగా కొట్టాడు. ఆ బంతి బౌండరీ లైన్ బయటపడే సమయంలో వేగంగా దూసుకు వచ్చిన బాల్ భాయ్ అమాంతం క్యాచ్ పట్టాడు. దీంతో స్టేడియంలో ప్రేక్షకులు అరుపులతో మార్మోగించారు. ఆ సమయంలో డగ్ ఔట్ లో ఉన్న జాంటీ రోడ్స్ బాల్ భాయ్ పట్టిన క్యాచ్ చూసి అభినందించాడు. అంతేకాదు తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అతడికి సైగ చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అతడిని అభినందించాడు. అతడు పట్టిన క్యాచ్ ను కామెంటేటర్లు కూడా మెచ్చుకున్నారు.
! ☺️
What happenes when Jonty Rhodes interviews Atharw – the Ball Kid who took that fine catch – By @ameyatilak #TATAIPL | #LSGvKKR | @LucknowIPL | @JontyRhodes8 pic.twitter.com/l3hUdhepGi
— IndianPremierLeague (@IPL) May 6, 2024