https://oktelugu.com/

Priyanka Chopra Husband: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక చోప్రా భర్త.. ఎమోషనల్ వీడియో వైరల్…

ప్రియాంక చోప్రా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే అమెరికన్ పాప్ సింగర్ అయిన 'నిక్ జోనస్' ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ళ పెళ్లి జరిగినప్పుడు చాలామంది చాలా రకాలుగా వీళ్ళని విమర్శించారు..

Written By:
  • Gopi
  • , Updated On : May 6, 2024 / 02:57 PM IST

    Priyanka Chopra husband Nick Jonas diagnosed with Influenza A

    Follow us on

    Priyanka Chopra Husband: ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. అయితే ప్రియాంక చోప్రా టాలివుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లో చాలా సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకుంది. ఇక అందులో భాగంగానే ఆమె పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే అమెరికన్ పాప్ సింగర్ అయిన ‘నిక్ జోనస్’ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ళ పెళ్లి జరిగినప్పుడు చాలామంది చాలా రకాలుగా వీళ్ళని విమర్శించారు. ఎందుకంటే ప్రియాంక చోప్రా కంటే నిక్ జోనస్ 10 సంవత్సరాలు చిన్నవాడు.

    అయినప్పటికీ తనను ఆమె ఏరికోరి మరి తననే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వీళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రియాంక చోప్రా సినిమాలకి బ్రేక్ ఇచ్చి అమెరికాలోనే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తన భర్త ఆయన నిక్ జొనస్ కి ఒక అరుదైన వ్యాధి సోకింది అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన గురించి కొన్ని కామెంట్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి.

    ఇక అసలు విషయానికి వస్తే నిక్ జోనస్ ప్రస్తుతం తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని చేశాడు. తను ‘ఇన్ ఫ్లూఎంజా ఏ ‘ అనే వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలియజేశాడు. ఇక దాంతో తనకు విపరీతమైన జ్వరం గొంతు నొప్పిగా ఉండటం వల్ల డాక్టర్ తనని కొద్ది రోజుల పాటు రెస్టు తీసుకోమని చెప్పడంతో ఆయన చేయాల్సిన కొన్ని మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్టుగా తెలియజేశాడు.

    ఇక ఆగస్టులో తన మ్యూజిక్ ఈవెంట్స్ ని పెద్ద ఎత్తున చేయబోతున్నట్టుగా తెలియజేశాడు. ఇక ఈ అనివార్యంగా ఎదురైనా ఇబ్బందుల వల్ల తను చాలా వరకు బాధపడుతున్నానని తన అభిమానులకు కూడా తనని అర్థం చేసుకోవాలని తను సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…