https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి కలిసి రాని సిస్టర్ సెంటిమెంట్.. మరి ఓజీ పరిస్థితి ఏంటి..?

పవన్ కళ్యాణ్ కి సిస్టర్ సెంటిమెంట్ తో సినిమాలు వర్కౌట్ అవ్వవు అనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ కూడా తన దగ్గరికి అలాంటి స్క్రిప్ట్ లను తీసుకెళ్లడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : May 6, 2024 / 02:52 PM IST

    Pawan Kalyan sister sentiment that did not come together

    Follow us on

    Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టారర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ తెలుగులో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈయన ఒకప్పుడు సిస్టర్ సెంటిమెంట్ తో చేసిన అన్నవరం సినిమా ఫ్లాప్ అయింది. ఇక దాంతో ఆయనకి సిస్టర్ సెంటిమెంట్ తో సినిమాలు వర్కౌట్ అవ్వవు అనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ కూడా తన దగ్గరికి అలాంటి స్క్రిప్ట్ లను తీసుకెళ్లడం లేదు.

    అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓ జి సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుందట. మరి ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు అన్నవరం సినిమా ప్లాప్ అయినట్టుగానే పవన్ కళ్యాణ్ ఓజి సినిమాతో ప్లాప్ ను మూటగట్టుకుంటాడా లేదంటే సక్సెస్ ను సాధిస్తాడు. అనేది కూడా ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. నిజానికి పవన్ కళ్యాణ్ కి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమాలు గానీ, లేదంటే లవ్ స్టోరీస్ తో నడిచే సినిమాలు గానీ చాలా మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి.

    ఇక అంతే తప్ప ఆయనకి ఒక రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ లో సిస్టర్, ఫ్యామిలీ అంటూ ఆయన సినిమాలు చేస్తే అవి జనాలకి పెద్దగా నచ్చడం లేదు. మరి ఓజీ కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నప్పటికీ ఇందులో సిస్టర్ సెంటిమెంట్ అనేది చాలా ప్రధానంగా కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా కూడా అన్నవరం సినిమాలాగే ప్లాప్ అవుతుందా? లేదంటే పవన్ కళ్యాణ్ కి సిస్టర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వదు అన్నా రూల్ ని బ్రేక్ చేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఓ సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడం అనేది సర్వ సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇక ఇప్పుడు ఓజి సినిమా మీద కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుంది అనేది…