https://oktelugu.com/

IPL 2022: నాడు ధోని.. నేడు పంత్ అచ్చం అలానే చేశారు.. కానీ..!

IPL 2022: ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని క్యాష్ చేసుకునేందుకు బీసీసీఐ ఐపీఎల్ గేమ్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫార్మాట్ సూపర్ హిట్టు కావడంతో ప్రతీయేటా నిర్వాహాకులు ఐపీఎల్ సీజన్లను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ జట్లు ఐపీఎల్ బరిలో నిలిచాయి. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచులు సగానికి పైగా మ్యాచులు జరిగాయి. పాయింట్ల పట్టికలో టాప్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2022 / 10:55 AM IST
    Follow us on

    IPL 2022: ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని క్యాష్ చేసుకునేందుకు బీసీసీఐ ఐపీఎల్ గేమ్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫార్మాట్ సూపర్ హిట్టు కావడంతో ప్రతీయేటా నిర్వాహాకులు ఐపీఎల్ సీజన్లను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి.

    కొత్తగా లక్నో, అహ్మదాబాద్ జట్లు ఐపీఎల్ బరిలో నిలిచాయి. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచులు సగానికి పైగా మ్యాచులు జరిగాయి. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కోసం ఆయా జట్లు పోటీ పడుతున్నాయి. ఇక నిన్న సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సినిమాలోని క్లైమాక్స్ ను తలపించేలా హైడ్రామా మధ్య మ్యాచ్ ముగియడం ఆసక్తిని రేపింది.

    ఈ మ్యాచులో ఢిల్లీ జట్టుకు అఖరి ఓవర్లో విజయం కోసం 36 పరుగులు కావాల్సి వచ్చింది. తొలి మూడు బంతులకు రోవ్ మన్ పావెల్ వరుస సిక్సర్లు బాదాడు. దాంతో విజయ సమీకరణం మూడు బంతులకు 18 పరుగులుగా మారింది. అయితే ఆ ఓవర్ మూడో బంతిని మెకాయ్ హై ఫుల్ టాస్ వేశాడు.

    ఈ బాల్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉందని దీనిని నో బాల్ గా ప్రకటించాలని మైదానంలో ఉన్న కుల్దీప్ యాదవ్, పావెల్ మొదట ఎంపైర్ ను కోరారు. అదే సమయంలో డగౌట్ లో ఉన్న ఢిల్లీ సారథి రిషభ్ పంత్ కూడా అది నో బాల్ అంటూ సైగ చేశాడు. అంపైర్లు మాత్రం దానిని నో బాల్ గా ప్రకటించలేదు. దీంతో పంత్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

    ఆ వెంటనే పావెల్, కుల్దీప్ లను డగౌట్ కు వచ్చేయాలంటూ ఆదేశించాడు. తన టీం సహాయక కోచ్ ఆమ్రేను మైదానంలోకి పంపాడు కూడా. ఇదే సమయంలో లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న జాస్ బట్లర్ పంత్ దగ్గరకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వీరిద్దరు కొద్దిసేపు వాదించుకున్నారు. దీంతో మ్యాచ్ చాలా సేపు ఆగిపోయింది.

    అనంతరం మ్యాచ్ కొనసాగగా చివరి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో రాజస్తాన్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే గతంలోనూ నో బోల్ విషయంలో ధోని అంపైర్లతో గొడవకు దిగాడు. నాడు చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా తొలి రెండు బంతులకు 10 పరుగులు రాగా.. మూడో బంతికి ధోని అవుటయ్యాడు.

    దీంతో చెన్నై గెలుపు సమీకరణం మారింది. చివరి మూడు బంతుల్లో ఎనిమిది పరుగులుగా చేయాల్సి వచ్చింది. స్టోక్స్ నాలుగో బంతిని ఫుల్ టాస్ గా వేశాడు. దానిని లాంగాన్ లోకి ఆడిన సాంట్నెర్ రెండు పరుగులు చేశాడు. అయితే ఆ ఫుల్ టాస్ బ్యాటర్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉండటంతో నో బాల్ గా ప్రకటించాల్సిందిగా క్రీజులో ఉన్న జడేజా అంపైర్ ను కోరాడు.

    ఫీల్డ్ అంపైర్లు మాత్రం ఒప్పుకోలేదు. ఈ సమయంలో డగౌట్ కు చేరిన ధోని అంపైర్లపై కోపంతో ఉగిపోయాడు. ధోనికి స్టోక్స్, రహానే, స్టీవ్ స్మిత్ నచ్చజెప్పడంతో మ్యాచ్ యథావిధిగా సాగింది. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా సాంట్నెర్ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందిస్తాడు. దీంతో చెన్నై జట్టు నాలుగు వికెట్లతో నాడు విజయం సాధించింది.