https://oktelugu.com/

Bigg Boss Akhil: స్ట్రాటజీ మార్చిన అఖిల్.. అతడితో ఫ్రెండ్ షిప్ కట్..!

Bigg Boss Akhil: ‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కలర్ ఫుల్ భామలతో హౌస్ కళకళ లాడుతుండగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మాత్రం హీట్ పుట్టిస్తున్నాయి. ఇక ఎనిమిదో వారం కెప్టెన్సీ కోసం కంటెస్ట్ మధ్య పోటీ తీవ్రమైంది. మరోవైపు ఎలిమినేషన్ ప్రక్రియ సైతం ఆసక్తికరంగా మారింది. కెప్టెన్సీ దక్కించుకునేందుకు కంటెస్టెంట్స్ అంతా పోటీ పడుతుండటంతో హౌస్ లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఆడ, మగ తేడా లేకుండా ఒకరిపై […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2022 / 10:23 AM IST
    Follow us on

    Bigg Boss Akhil: ‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కలర్ ఫుల్ భామలతో హౌస్ కళకళ లాడుతుండగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మాత్రం హీట్ పుట్టిస్తున్నాయి. ఇక ఎనిమిదో వారం కెప్టెన్సీ కోసం కంటెస్ట్ మధ్య పోటీ తీవ్రమైంది. మరోవైపు ఎలిమినేషన్ ప్రక్రియ సైతం ఆసక్తికరంగా మారింది.

    కెప్టెన్సీ దక్కించుకునేందుకు కంటెస్టెంట్స్ అంతా పోటీ పడుతుండటంతో హౌస్ లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఆడ, మగ తేడా లేకుండా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. బిగ్ బాస్ లో ఫేవరేట్ గా కొనసాగుతున్న అఖిల్ తాజాగా ఇతన స్ట్రాటజీ మార్చివేయడం ఆసక్తికరంగా మారింది.

    తొలుత తన గ్రూపులో గ్రూప్‌లో అజయ్, స్రవంతి, అషురెడ్డి, నటరాజ్‌లు ఉండేవారు. ఈ గ్రూపు నుంచి స్రవంతిని తొలుత పంపించారు. ఆ స్థానంలో బాబా భాస్కర్ రాకతో అఖిల్ తన స్ట్రాటనీని మార్చాడు. కెప్టెన్సీ కోసం అజయ్ దోస్తీని కట్ చేసుకున్నాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో నటరాజ్ మాస్టర్ వేసిన పచ్చడి దోసెల ప్రయోగం వికటించింది.

    ఈ దోసెలను టేస్ట్ చేసిన అఖిల్, అజయ్‌, అరియానాలు అస్సలు బాలేదని చెప్పి వేరే టిఫిన్ చేయండని చెప్పాడు. అయితే మిత్రా పాప మాత్రం సూపర్ అంటూ లాగించేసింది. ఆ తర్వాత బిందు, అజయ్, అనీల్‌లు కూర్చుని బాబా భాస్కర్ గురించి మాట్లాడుకున్నారు. బాబా భాస్కర్ గెస్ట్‌గా ఒకవారమో రెండు వారాలో ఉండొచ్చు.. గేమ్ డీవియేట్ చేయడానికే వచ్చారని బిందు చెప్పింది.

    దీనికి అనిల్ స్పందిస్తూ సంచాలక్‌గా ఆయన్ని పెట్టారంటేనే గేమ్ అర్ధం చేసుకోవచ్చన్నాడు. ఆయన కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో.. నాకెందుకో ఆయన వైబ్ నచ్చిందని.. ఆయన్ని కెప్టెన్‌గా చూడాలని అనుకుంటున్నా’నని బిందు మాధవి చెప్పింది. ఈ వారం యాక్టివిటీలో భాగంగా బ్యాక్ స్టెప్ చేసే ఆ ఒక్కరు ఎవరు? ఎవరు మిమల్ని సేవ్ చేస్తారనే టాస్క్ కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఇచ్చాడు.

    అయితే తనకి హౌస్‌లో ఎవరూ లేరని.. అలాంటి బాండింగ్ ఎవరితోనూ లేదు.. అలాంటి ఫీలింగ్ ఇప్పటివరకూ రాలేదు.. అందుకే సేవ్ అనే ట్యాగ్‌ని ఎవరికీ ఇవ్వను అఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే టాస్క్ కంప్లీట్ చేయాలని ఎవరికొకరికి ట్యాగ్ ఇవ్వాలని చెప్పడంతో మిత్ర‌కి సేవ్ ట్యాగ్ ఇచ్చాడు అఖిల్. ఇన్నాళ్లూ వాడుకుని అజయ్‌ని అఖిల్‌ దూరం పెట్టేస్తే.. బిందు మాధవి మాత్రం అజయ్‌కి సేవ్ ట్యాగ్ ఇచ్చింది.

    Recommended Videos: