Du Plessis Named RCB Captain For IPL 2022: ఐపీఎల్లో అత్యంత బలమైన జట్లలో ఆర్సీబీ కూడా ఒకటి. బెంగుళూరు లేకుండా ఐపీఎల్ లో ఎంజాయ్ మెంట్ ను ఊహించడం కష్టం. ఒక్కటంటే ఒక్క సారి కూడా టైటిల్ గెలవకపోయినా.. ఐపీఎల్లో ఫేవరెట్ జట్టుగా ఇప్పటికీ రారాజుగా ఉంది. ఒక్కసారైనా టైటిల్ గెలిస్తే చూడాలని ఆశపడే వారు కోట్ల మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల అభిమానులు కూడా ఆర్సిబిని తమ ఫేవరేట్ గా పేర్కొంటున్నారు అంటే దానికి కారణం విరాట్ కోహ్లీ.
క్రికెట్ చరిత్రలో తిరుగులేని రికార్డులను తన సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ.. 2013 నుంచి ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సిబి ఎన్నో సంచలన మ్యాచ్ లను గెలిచి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఐపీఎల్లో ఏ జట్టు బ్యాటింగ్ అద్భుతం అని అంటే అందరూ తడబడకుండా చెప్తే మాట ఆర్సిబి. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటికి మూడు సార్లు ఫైనల్స్ కు వెళ్ళినా కూడా.. ఐపీఎల్ చరిత్రలో ఒక్క టైటిల్ కూడా గెలవలేదు బెంగళూరు.
Also Read: పవన్ కళ్యాణ్ మీటింగ్ తో వైసీపీలో టెన్షన్!
దీంతో 2021 ఐపీఎల్ సీజన్ తో తన కెప్టెన్సీకి విరాట్ వీడ్కోలు పలికారు. దీంతో ఈ సారి ఎవరు కెప్టెన్ అవుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కెప్టెన్ రేసులో డుప్లెసిస్, దినేష్ కార్తీక్, మ్యాక్స్ వెల్ పేర్లు బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే బెంగళూరు తమ కొత్త సారధిని ప్రకటించింది.
సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ ను తమ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఇతను గతంలో చెన్నై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈసారి జరిగిన వేలంలో రూ.7 కోట్లకు ఆర్సిబి అతన్ని దక్కించుకుంది. ఇతను గతంలో సౌతాఫ్రికా కెప్టెన్ గా కూడా పని చేశాడు. ఆ అనుభవమే అతనికి ఆర్ సి పి పగ్గాలు వచ్చేలా చేసింది. ఇప్పుడు అతని ముందున్న ఒకే ఒక సవాల్ ఆర్సిబికి టైటిల్ సాధించి పెట్టడం. మరి కోహ్లీ వారసుడిగా అతను ఏ మేరకు సక్సెస్ అవుతాడో వేచి చూడాలి.
Also Read: మంత్రుల మార్పు వచ్చే ఎన్నికలపై ఎఫెక్ట్ చూపుతుందా.. ఏ మాత్రం తేడా కొట్టిన అంతే..