OKTelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వంతో చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి పెళ్లి సందD మూవీతో సక్సెస్ సాధించిన రోషన్‌కు మరో సూపర్బ్ అవకాశం దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె కూడా ఇదే బ్యానర్‌లో వస్తోంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. RRRని ఘనవిజయం చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు జక్కన. ఐమాక్స్ అని, 3D అని అన్నిట్లలో ది బెస్ట్ అనే రీతిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, ఇప్పుడు డాల్బీ సినిమాలో కూడా వస్తున్న మొట్టమొదటి భారత సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. డాల్బీ సినిమా టెక్నాలజీ అంటే డాల్బీ విజన్, అట్మోస్ టెక్నాలజీను మిలితం చేస్తూ వీక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమాపై హీరోయిన్ స్పదించింది. ‘రాధికను టిల్లు నమ్మలేదు. కానీ, మీరు నమ్మారు. మీరంతా రాధికను అక్కున చేర్చుకున్నారు. మీ అందరినీ రాధిక కూడా ప్రేమిస్తుంది. డీజే టిల్లును అంతటి సక్సెస్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రతి అడుగు చిరస్మరణీయమయ్యేలా ప్రతి రోజూ ప్రయత్నిస్తానని మాటిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేసింది.

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. RX100 భామ పాయల్ రాజ్ పుత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో సందడి చేసింది. ఇవాళ ఉదయం ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో మెరిసిపోయే ఆమె.. తిరుమలకు చాలా సాంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చింది. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.
Also Read:‘భీమ్లా నాయక్’ 15 డేస్ కలెక్షన్స్.. పవన్ రేంజ్ ఇది