https://oktelugu.com/

Actor Sai Pallavi: అప్పట్లో విజయశాంతి, తర్వాత రోజా.. ఈ తరంలో సాయిపల్లవి.. ఏ విషయంలో అంటే

Actor Sai Pallavi: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవి అని చెప్పుకోవాలి. ఫిదా మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి చక్కని హావభావాలతో కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా నటించకపోయినా కూడా.. ఎవరికీ దక్కనంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. గ్లామర్ డోస్ కు దూరంగా ఉంటూ.. కేవలం […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 13, 2022 / 12:12 PM IST
    Follow us on

    Actor Sai Pallavi: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవి అని చెప్పుకోవాలి. ఫిదా మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి చక్కని హావభావాలతో కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా నటించకపోయినా కూడా.. ఎవరికీ దక్కనంత క్రేజ్ ను సొంతం చేసుకుంది.

    Actor Sai Pallavi

    గ్లామర్ డోస్ కు దూరంగా ఉంటూ.. కేవలం నటనా పరమైన పాత్రలకే తన ఓటు అంటోంది. ఈ తేడానే మిగతా హీరోయిన్ల కంటే ఆమెను స్పెషల్ గా చూసేలా చేస్తుంది. అయితే ఇప్పుడు ఎవరూ చేయని చాలా విభిన్నమైన పాత్రలో ఆమె కనిపించబోతోంది. ఒకప్పుడు ఇలాంటి పాత్రలు విజయశాంతి ఆ తర్వాత రోజు మాత్రమే చేసి చూపించారు.

    Also Read:   తగ్గేదే లే అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మరి చరణ్ పరిస్థితేమిటి ?

    ఒసేయ్ రాములమ్మ మూవీలో విజయశాంతి నక్సలైట్ గా కనిపించి మెప్పించింది. అప్పటి నుంచి అందరూ ఆమెను రాములమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. ఇక ఆమె తర్వాత కృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్కౌంటర్ మూవీలో రోజా నక్సలైట్ గా మెరిసింది. అందులో ఆమె చేసిన స్వర్ణక్క పాత్ర బాగా పేరు తెచ్చుకోవడంతో.. ఆ తర్వాత స్వర్ణక్క అనే టైటిల్ తో సినిమా కూడా చేసింది.

    Actor Sai Pallavi

    కాగా ఇప్పటి తరం హీరోయిన్లలో ఎవరూ చేయని నక్సలైట్ పాత్రను చేయడానికి సాయి పల్లవి రెడీ అయింది. విరాటపర్వం మూవీలో రానా తో కలిసి సాయి పల్లవి నటించింది. ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రియమని కూడా నక్సలైట్ పాత్రలో మెరిసింది. సున్నితమైన భావోద్వేగాల సన్నివేశాలతో కూడిన ఈ మూవీని వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మనసును కలచివేసే కథతో తెరకెక్కింది అని తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఈ మూవీ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఇప్పటి తరం హీరోయిన్లలో అలాంటి పాత్రకు ఒప్పుకున్న సాయి పల్లవి ఒక రికార్డు క్రియేట్ చేసింది అనే చెప్పుకోవాలి.

    Also Read: మహేష్ – రాజమౌళి’ సినిమా ఎక్స్ క్లూజివ్ డిటైల్స్

    Tags