https://oktelugu.com/

డ్రగ్స్ వ్యవహారంలో ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ ?

డ్రగ్స్ వ్యవహరం ఏదో ఒక సందర్భంలో ఒక భాషకు సంబంధించిన ఇండస్ట్రీని కుదిపేస్తూ వస్తోంది. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ సంవత్సరం జూన్ 14వ తేదీన మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కూడా డ్రగ్స్ కు ముఖ్య పాత్ర ఉంది. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారం మరో ఇండస్ట్రీని కుదిపేస్తుండటం గమనార్హం. కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగుతోంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 8, 2020 / 04:31 PM IST
    Follow us on

    డ్రగ్స్ వ్యవహరం ఏదో ఒక సందర్భంలో ఒక భాషకు సంబంధించిన ఇండస్ట్రీని కుదిపేస్తూ వస్తోంది. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ సంవత్సరం జూన్ 14వ తేదీన మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కూడా డ్రగ్స్ కు ముఖ్య పాత్ర ఉంది. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారం మరో ఇండస్ట్రీని కుదిపేస్తుండటం గమనార్హం.

    కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగుతోంది. ప్రభాస్ తో బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటక సర్కార్ డ్రగ్స్ వ్యవహారం విషయంలో చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఈ కేసును విచారణ జరుపుతున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు ఇప్పటికే ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేశారు.

    సంజన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆధారాలు బలంగా ఉండటం వల్లే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రస్తుతం సంజనను సోదాల అనంతరం అదుపులోకి తీసుకుని హెడ్ క్వార్టర్స్ లో విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సంజనా ఇంట్లో సోదాలు నిర్వహించారు. కన్నడ చిత్రపరిశ్రమ మత్తు వదిలే విధంగా పోలీసులు ఈ కేసులో ప్రముఖ నటులను అరెస్ట్ చేస్తుండటం గమనార్హం. సంజనను విచారించిన తరువాత పోలీసులు ఇంకా ఎవరెవరిపై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది.