Homeక్రీడలుVinesh Phogat : రక్తం తీసినా.. జుట్టు కత్తిరించినా.. వినేశ్‌ ఫోగట్‌ మిస్సైన ‘ఫైనల్‌’ ఫైట్‌...

Vinesh Phogat : రక్తం తీసినా.. జుట్టు కత్తిరించినా.. వినేశ్‌ ఫోగట్‌ మిస్సైన ‘ఫైనల్‌’ ఫైట్‌ వింటే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

Vinesh Phogat : ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు ఈసారి ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. పతకం ఖాయం అనుకున్న దశలో ప్రత్యర్థి చేతిలో ఓడిపోతున్నారు. దీంతో భారత క్రీడాభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, ఇలా పలు క్రీడాంశాల్లో క్వార్టర్‌ ఫైనల్‌ వరకు దూసుకుపోతున్న మన ఆటగాళ్లు క్వార్టర్స్‌లో చతికిల పడుతున్నారు. నిరాశగా వెనుదిరుగుతున్నారు. అప్పటి వరకు మంచి ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లు.. చివరకు క్వార్టర్‌ ఫైనల్స్‌లో చేతులు ఎత్తేస్తున్నారు. ఇంత వరకు ఒక ఎత్తు.. అయితే… తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌.. భారత పతకం ఆశలపై నీళ్లు చల్లింది. రెజ్లింగ్‌లో గోల్డ్‌ లేదా సిల్వర్‌ మెడల్‌ ఖాయం అనుకుంటున్న దశలో.. ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్‌ వినోశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు షాక్‌ ఇచ్చింది. 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఫోగట్‌ భారత్‌కు పతకం ఖాయం చేసింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాములు అధిక భరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తోంది.

వరల్డ్‌ ఛాంపియన్‌కు షాక్‌ ఇచ్చి..
మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో వినేశ్‌ ఫోగట్‌ 5–0 తేడాతో వరల్డ్‌ ఛాంపియన్‌ రెజ్లర్‌ క్యూబాకు చెందిన యుస్నీలీస్‌ గుజ్మాన్‌ను మట్టికరిపించింది. ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో భారతీయులంతా రెజ్లింగ్‌లో మనకు పతకం ఖాయమనుకున్నారు. కానీ ఫైనల్‌ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఐవోసీ వినేశ్‌పై అనర్హత వేటు వేసింది. దీనిపై భారత అధికారులు నిరసన తెలిపారు.

వేయిట్‌ తగ్గేందుకు..
ఇక ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఫోగట్‌ బరువుపై అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో మంగళవారం రాత్రంతా ఆమె తీవ్ర కసరత్తు చేసింది. బరువు తగ్గడానికి జుత్తు కత్తింరించుకుంది. రక్తం కూడా తీయించుకుంది. ఇక నీళ్లు తాగకుండా, ఆహారం తీసుకోకుండా జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్‌ చేసింది. అయినా ఫలితం దక్కలేదు. దురదృష్టం ఆమె వెన్నంటే ఉంది. దీంతో ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో పోటీకి అనర్హురాలుగా ప్రకటించారు. 100 కోట్ల మంది భారతీయుల ఆశలపై ఐవోసీ అధికారులు నీళ్లు చల్లారు.

గోల్డ్‌ మెడల్‌ ఎవరికంటే..?
ఇక ఈ పోటీల్లో వినేశ్‌పై అనర్హత వేటు పడినందున ఆమెకు ఎలాంటి పతకం ఇవ్వరు. అయితే ఆమోతోపాటు ఫైనల్‌లో ఉన్న అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెబ్రాండ్‌కు మాత్రం ఆఖరిపోరులో పాల్గొనకుండానే బంగారు పతకం అందిస్తారు. సిల్వర్‌ మెండల్‌ మాత్రం ఎవరికీ కేటాయించరు. ఇక కాంస్య పతక పోటీలు లాంఛనంగా జరుగతాయని ఐవోసీ ప్రకటించింది.

ఐవోఏ ఛాలెంజ్‌..
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై భారత ఒలింపిక్‌ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ఛాలెంజ్‌ చేసేందుకు సిద్ధమైంది. పోటీ జరిగిన రోజు 50 కేజీలు ఉండి, పైనల్‌కు ముందు రాత్రి బరువు పెరిగినట్లు పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐవోసీ పునఃసమీక్ష చేయకుంటే.. ఫోగట్‌పై అనర్హత కొనసాగుతుంది.

మోదీ భరోసా..
ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ వీనేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు పడడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈమేరకు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘‘వీనేశ్‌ నువ్వు ఛాంపియన్లకే చాంపియణ.. నీ ప్రతిభ దేశానికే గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు ఓ ఇన్‌స్పిరేషన్‌. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. దీనిపై విచారం వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రావాలని నేను నమ్ముతున్నాను. కఠినమైన సవాళ్లను ఎదురించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం’’ అని వినేశ్‌కు భరోసా ఇచ్చారు.

బ్రిజ్‌ భూషణ్‌పై పోరాటం..
ఫోగట్‌ గతేడాది ఐవోసీ ఇండియా చైర్మన్‌ బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. పోలీసుల లాఠీ దెబ్బలు కూడా తిన్నది. అవమానాలను ఓర్చుకుంది. అవమానాలు ఓర్చుకొని, దాదాపు ఏడాదిన్నపాటు ఆటకు దూరమైంది. అయినా ఎంతో కష్టపడి ఒలంపిక్స్‌కు సిద్ధమైంది వినేశ్‌ ఫోగట్‌. ఒలింపిక్స్‌లో అంతే పట్టుదలగా ఆడి తన కష్టానికి ఫలితం దక్కుతుందనుకుంది. కానీ చివరి నిమిషంలో 100 గ్రాముల ఓవర్‌ వెయిట్‌ కారణంగా ఒలంపిక్స్‌ను నుండి బయటకు రావాల్సి వచ్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular