KL Rahul: ఇన్ని పరిస్థితుల మధ్య కేఎల్ రాహుల్ లక్నో జట్టు నుంచి వెళ్లిపోయాడు. ఢిల్లీ జట్టుకు మారిపోయాడు. వాస్తవానికి అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ బ్యాటింగ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలనే అతడి నిర్ణయం సబబు అనిపించడంతో ఢిల్లీ మేనేజ్మెంట్ కాదనలేకపోయింది. దీంతో అక్షర్ పటేల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. ఫలితంగా ఢిల్లీ జట్టుకు నాయకుడిగా అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు. ఇక కీలక ఆటగాడిగా కేఎల్ రాహుల్ ఆడటం మొదలుపెట్టాడు. ఢిల్లీ జట్టుకు మరుపురాని విజయాలు అందించాడు. ముఖ్యంగా బెంగళూరు మైదానంపై బెంగళూరు జట్టుపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. ఏకంగా తన బ్యాటుతో గిరి గిసుకున్నాడు. ఇది నా ఓన్ గ్రౌండ్ రా బాబూ హెచ్చరికలు పంపాడు. అలాంటి ఆటగాడి ఆధ్వర్యంలో సాగుతున్న జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్తుందని అందరు అనుకున్నారు. చివరికి జరిగింది మాత్రం వేరు. ఊహించింది ఒకటైతే.. క్షేత్రస్థాయిలో కళ్ళముందు కనిపించింది మరొకటి.
Also Read: నిరుడు విభేదాలు.. మైదానంలోనే కొట్లాటలు.. ఏడాదిలోనే ముంబై ఇండియన్స్ ఇలా ఎలా మారింది?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేఎల్ రాహుల్ ఏకంగా 500 మించి పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 150, యావరేజ్ 57.. రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. మూడు అర్థ శతకాలు చేశాడు. ఒక సెంచరీ కూడా కొట్టాడు. ఓపెనర్ నుంచి మొదలు పెడితే నాలుగో స్థానం వరకు బ్యాటింగ్ చేశాడు. జట్టు అవసరాల దృష్ట్యా తనని తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఒకరకంగా ఐపీఎల్లో ఏ జట్టుకైనా సరే తనలాంటి ఆటగాడు లేడని.. ఇప్పట్లో రాలేడని తన బ్యాటింగ్ ద్వారా నిరూపించాడు. అయితే అటువంటి కేఎల్ రాహుల్ ఇటీవల గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో శివతాండవం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోయింది. దీంతో బుధవారం నాటి ముంబై మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ మీద భారం పడింది. అతడు ఓనర్ గా వచ్చాడు.. కానీ 11 పరుగులు మాత్రమే చేసి.. ఢిల్లీ అభిమానుల ఆశలు పై నీళ్లు చల్లి వెళ్లిపోయాడు. అతడు మైదానం నుంచి వెళ్ళిపోతూ ఎంతటి భారమైన వేదన అనుభవించాడో.. ఎంతటి భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడో.. తనను తాను తిట్టుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తీవ్రమైన బాధతో కనిపించాడు.
వాస్తవానికి కేఎల్ రాహుల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడని.. గొప్ప ఇన్నింగ్స్ ఆడతాడని ఢిల్లీ అభిమానులు భావించారు. కచ్చితంగా జట్టును విజయతీరాల వైపు తీసుకెళ్తాడని అనుకున్నారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. కీలక దశలలో వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ జట్టు ముంబైని ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది. గెలవాల్సిన మ్యాచ్లో చేతులెత్తేసింది.. గత ఏడాది కూడా ఢిల్లీ జట్టు పర్వాలేదు అనే స్థాయిలో ఆడింది. ఈసారి కాస్త మెరుగ్గాడింది. కాకపోతే ప్లే ఆఫ్ వెళ్లి ఉంటే ఇంకా బాగుండేది.