Para Olympics 2024 : పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. అంచనాల గురించి రాణించారు. మెడల్స్ సాధించి సత్తా చాటారు. 25 మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుంటే.. ఏకంగా 29 పతకాలతో చరిత్ర సృష్టించారు. దేశ ప్రతిష్టను ప్రపంచ క్రీడావేదికపై ఇనుమడింపజేశారు.
25 మెడల్స్ లక్ష్యంగా 84 మంది ఆటగాళ్లు పారిస్ బయలుదేరారు. వారిలో ఏకంగా 29 మంది మెడల్స్ సాధించారు. భారత్ సాధించిన మెడల్స్ లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. మెడల్స్ జాబితాలో భారత్ 18వ స్థానంలో నిలిచింది. గతంలో టోక్యో పారాలింపిక్స్ లో భారత్ 19 మెడల్స్ సాధించింది. ఈ ఘనతను మన ఆటగాళ్లు ప్రారంభంలోనే బ్రేక్ చేశారు. 1968 నుంచి భారత్ పారాలింపిక్స్ లో పోటీపడుతోంది. 2016 పారాలింపిక్స్ వరకు మన ఆటగాళ్లు కేవలం 12 మెడల్స్ మాత్రమే సాధించారు. ఇక ఆ తర్వాత గేమ్ మారింది. గత రెండు పారాలింపిక్స్ లు ఏకంగా 48 మెడల్స్ సాధించారు. ఇందులో 12 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కంచు పతకాలు ఉన్నాయి. పారిస్ పారాలింపిక్స్ ఆదివారంతో ముగుస్తాయి..
ప్రధాని హర్షం
భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేసి, మెడల్స్ సాధించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.. పారాలింపిక్స్ పోటీలలో ఆటగాళ్లు భారత ప్రతిష్టను విశ్వ క్రీడావేదికపై ఇనుమడింప చేశారని కొనియాడారు. ఇదే ప్రదర్శన వచ్చే పోటీలలో కూడా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. టోక్యో పారాలింపిక్స్ కంటే పారిస్ లో జరిగిన పోటీలలో ఆటగాళ్లు ఎక్కువ మెడల్స్ సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.. ఇదే స్ఫూర్తి మున్ముందు కొనసాగించాలని సూచించారు.
మెడల్స్ సాధించిన ఆటగాళ్లు వీరే
అవని, షూటింగ్లో స్వర్ణం
మోనా అగర్వాల్, షూటింగ్లో కాంస్యం
ప్రతి పాల్ అథ్లెటిక్స్ లో కాంస్యం
మనీష్ షూటింగ్లో రజతం
రూబీ నా ఫ్రాన్సిస్ షూటింగ్లో కాంస్యం
ప్రతి పాల్ అథ్లెటిక్స్ లో కాంస్యం
నిషాద్ కుమార్ అథ్లెటిక్స్ లో రజతం
యోగేష్ అథ్లెటిక్స్ లో రజతం
నితేష్ కుమార్ బ్యాడ్మింటన్ లో స్వర్ణం
తులసి మతి మురుగేషన్ బ్యాడ్మింటన్ లో రజతం
మనిషా రామదాసు బ్యాడ్మింటన్ లో కాంస్యం
సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ లో రజతం
రాకేష్ కుమార్, శీతల దేవి ఆర్చరీలో కాంస్యం
సుమిత్ ఆంటీల్ అథ్లెటిక్స్ లో స్వర్ణం
దీప్తి జీవాంజి అథ్లెటిక్స్ లో కాంస్యం
మరియప్పన్ తంగవేలు అథ్లెటిక్స్ లో కాంస్యం
శరద్ కుమార్ అథ్లెటిక్స్ లో రజతం
అర్జిత్ సింగ్ అథ్లెటిక్స్ లో రజతం
గుర్జర్ సుందర్ సింగ్ అథ్లెటిక్స్ లో కాంస్యం
సచిన్ కిలారి అథ్లెటిక్స్ లో రజతం
అరవిందర్ సింగ్ ఆర్చరీలో స్వర్ణం
ధరం బీర్ సింగ్ అథ్లెటిక్స్ లో స్వర్ణం
ప్రణవ్ అథ్లెటిక్స్ లో రజతం సాధించారు.