Indian Women Team: 2005లో వన్డే వరల్డ్ కప్ జరిగినప్పుడు టీమిండియా ఫైనల్ వెళ్ళింది. మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో టీమిండియా విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత అనేక సందర్భాలలో సెమీఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ టీమిండియా నిరాశతోనే ఇంటికి వచ్చింది. మిథాలీ, అంజూ, గోస్వామి.. ఇలా చాలామంది లెజెండరీ ప్లేయర్ లు ఉన్నప్పటికీ టీమిండియా కీలక దశలో అంచనాలను అందుకోలేకపోయింది.
2017 లోనూ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది టీం ఇండియా. అప్పుడు టీమ్ ఇండియాలో మంచి యంగ్ ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఈసారి ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టును గురించి టీమ్ ఇండియా విజయం సాధిస్తుందని.. ట్రోఫీని అందుకుంటుందని అందరూ భావించారు. కానీ టీమిండియా ఆస్ట్రేలియా జట్టును ఓడించి.. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో మరోసారి ట్రోఫీ కల సొంతం కాలేదు. ఇక ఆ తర్వాత మిథాలీ రాజ్ క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్పడంతో టీమ్ ఇండియా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.
కానీ ఎప్పుడైతే టీమిండియాలో అమోల్ శిక్షకుడిగా ప్రవేశించాడో.. అప్పుడే జట్టు పరిస్థితి మొత్తం మారిపోయింది. వరుస విజయాలను టీమిండియా సాధించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ టీమిండియా విషయంలో ఎంతో కొంత వెలితి కనిపించేది. అయితే ఈసారి స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో టీమిండియా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే కీలకమైన దశలో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో ఊహించని ఓటమిని ఎదుర్కొంది. వాస్తవానికి ఈ మూడు మ్యాచ్ల్లో టీమిండియా గెలవాలి. కానీ ఒత్తిడికి తట్టుకోలేక టీమ్ ఇండియా ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు మీద గెలవడం.. ఆస్ట్రేలియా జట్టు మీద సెమి ఫైనల్ మ్యాచ్లో 339 పరుగుల లక్ష్యాన్ని కూడా ఫినిష్ చేయడం.. ఫైనల్ మ్యాచ్లో షపాలి వర్మ జట్టులోకి రావడంతో టీమిండియా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లారా క్యాచ్ అమన్ పట్టడం.. శర్మ 5 వికెట్లు సాధించడం.. ఇవన్నీ కూడా టీమిండియా పాలిట అదృష్టాలుగా మారిపోయాయి. వాస్తవానికి వీటిని అదృష్టం అనే కంటే సంవత్సరాలుగా పడుతున్న కష్టం అనుకోవచ్చు.
ఎటువంటి అంచనాలు లేని చోట.. టీ మీడియా ప్లేయర్లు వాటిని నిజం చేసి చూపించారు. సుదీర్ఘకాలం కలగా ఉన్న వరల్డ్ కప్ కలను నిజం చేసి చూపించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు మాత్రమే పరిమితమైన వన్డే వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్నారు.. ఆసియా నుంచి ఈ ఘనత అందుకున్న జట్టుగా భారతదేశాన్ని నిలిపారు. ప్రస్తుతం యంగ్ ప్లేయర్లు టీమిండియా ముఖచిత్రాన్ని మొత్తం మార్చేశారు. ఇకపై భవిష్యత్తు కాలం మొత్తం తమదే అని స్పష్టం చేశారు. ఈ లెక్కన చూసుకుంటే భవిష్యత్తు కాలంలో టీమిండియాలో మొత్తం యంగ్ ప్లేయర్లు నిండిపోతారు. ప్రపంచ మహిళా క్రికెట్ మొత్తాన్ని శాసిస్తారు.. అందులో ఏమాత్రం అనుమానం లేదు.