Kidney And Liver Health Foods: మన శరీరంలోకి ఎన్నో రకాల ఆహార పదార్థాలు వెళుతూ ఉంటాయి. వీటిలో కొన్ని ద్రవపదార్థాలు, మరికొన్ని ఘన పదార్థాలు ఉంటాయి. ఈ రెండింటిని మిశ్రమం చేసి స్వచ్ఛమైన ప్రోటీన్లను తయారు చేసి మిగతా అవయవాలకు పంపించగా.. విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ పనిని లివర్, కిడ్నీలు చేస్తాయి. అయితే ఈ రెండు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని ఆహారం సక్రమంగా జీర్ణమై జీర్ణ క్రియకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇవి చెడిపోతే ఈ పనిని సక్రమంగా చేయలేకపోవడంతో విషతుల్యమైన ఆహారం శరీరంలో ఉండి అనేక రోగాలకు దారితీస్తుంది. మరి లివర్, కిడ్నీ పాడైపోవడానికి కారణాలు ఏంటి? అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అధిక మధ్యపానం, మానసిక ఒత్తిడి, కొవ్వు ఎక్కువగా కలిగిన పదార్థాలను తీసుకోవడంతో పాటు సరైన నీరు తీసుకోకపోవడంతో లివర్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అలాగే అనవసరంగా ఎక్కువగా మెడిసిన్స్ వాడటం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా షుగర్, బిపి, ఊబకాయం ఉన్న వారిలో ఉంటుంది. అయితే మనకు లివర్, కిడ్నీలు దెబ్బతిన్నాయా అనే విషయాన్ని ప్రత్యేకంగా ఎవరు గుర్తించరు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను బట్టి తెలుసుకోవచ్చు. జీర్ణ క్రియ లో ఇబ్బంది ఏర్పడడం.. చర్మం పసుపు రంగులోకి మారడం.. ఆకలి తగ్గడం.. అలసట ఎక్కువగా ఉన్న వారిలో లివర్ సమస్య ఉన్నట్లు గుర్తించుకోవాలి. మూత్రం తక్కువగా రావడం.. లేదా మూత్ర విసర్జన అధికంగా రావడం.. కాళ్లు వాపులు ఎక్కువగా రావడం.. బీపీ పెరగడం వంటి లక్షణాలు ఉంటే కిడ్నీల సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. ఈ సమస్యలు ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తే అవి శాశ్వతంగా పనిచేయకుండా మారే ప్రమాదం ఉంది.
అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. నాణ్యమైన ఆహారంలో భాగంగా 35 నుంచి 60 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా మద్యం తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆల్కహాల్ కు దూరంగా ఉండడం వల్ల పై సమస్యలు రాకుండా ఉండొచ్చు. అలాగే అనేక రకాల ఒత్తిడితో ఉంటారు. ఒత్తిడిని కలిగి ఉన్నా.. ఆ తర్వాత మనశ్శాంతి కోసం ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లను నిత్యం తీసుకునే ప్రయత్నం చేయాలి. వీటిలో ఆకుకూరలు, నీటితో సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు, నిమ్మరసం, తేనే గ్రీన్ టీ, పాలకూర, కీర, క్యారెట్, దానిమ్మ వంటి పదార్థాలు లివర్ కిడ్నీలకు మేలు చేస్తాయి. ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీరు తాగడం వల్ల కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇదే సమయంలో ఎక్కువగా నూనె కలిగిన లేదా మసాలా కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుత కాలంలో బయట దొరికే ఆహారానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. వీటిని కూడా అవాయిడ్ చేయడం వల్ల కిడ్నీ, లివర్ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.