England Vs Australia Ashes: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా: భారత్ ఎంపైర్ నితిన్ మీనన్ చేసిన పనికి అంతా ఫిదా

భారత్ అంపైర్ నితిన్ మీనన్ కు ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌ ఎంపైరింగ్ చేసే అవకాశం దక్కింది.

Written By: Vadde, Updated On : July 31, 2023 11:42 am

England Vs Australia Ashes

Follow us on

England Vs Australia Ashes: ఎప్పుడు క్రికెట్ కు సంబంధించి పాపులర్ న్యూస్ వచ్చింది అంటే అది ఏ బౌలర్ లేక బ్యాట్స్మెన్ గురించి అయి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇండియన్ ఎంపైర్ అయిన నితిన్ మీనన్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. అతని పై కేవలం మాజీ క్రికెటర్లే కాక క్రికెట్ అభిమానులు మరియు విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ అతను అంతగా ఏం చేశాడు అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

భారత్ అంపైర్ నితిన్ మీనన్ కు ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌ ఎంపైరింగ్ చేసే అవకాశం దక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవకాశాన్ని నితిన్ చక్కగా వాడుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ కి ఫీల్డింగ్ అంపైర్గా తన బాధ్యత నిర్వహించిన నితిన్ ఐదవ టెస్టు వచ్చేసరికి థర్డ్ ఎంపైర్ గా తన విధులు నిర్వర్తించారు.

ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నారా…థర్డ్ ఎంపైర్ గా వ్యవహరిస్తున్న సమయంలో అయిదవ టెస్ట్ రెండవ రోజు ఆట జరిగేటప్పుడు నితిన్ మీనన్ తీసుకున్న ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అందరిని కట్టిపడేసింది.
ఎవరు ఊహించని విధంగా రెండవ సెషన్ ఆట జరిగే సమయంలో స్టీవ్ స్మిత్ రునౌట్ పై చోటు చేసుకున్న హై డ్రామా సందర్భంగా నితిన్ మీనన్ థర్డ్ ఎంపైర్ గా తన నిర్ణయం ప్రకటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

మ్యాచ్ 78వ ఓవర్ లో క్రిస్ వోక్స్ వేసిన బాల్ కి స్టీల్ స్మిత్ రనౌట్ అయ్యాడు. నిజానికి తన వైపుకు దూసుకు వస్తున్న అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని మిడ్ వికెట్ దిశగా బౌండరీ వైపు మళ్ళించడానికి ప్రయత్నించాడు స్మిత్. అయితే బంతికంటే వేగంగా కదిలిన ఇంగ్లాండ్ ఫీల్డర్ బంతిని అంతకంటే వేగంగా వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో అందించాడు. జానీ కూడా అస్సలు టైం వేస్ట్ చేయకుండా నేరుగా బంతిని గురిపెట్టి వికెట్స్ పడగొట్టాడు.

జానీ విసిరిన బంతి వికెట్ను తాకే టైం కి స్మిత్ ఇంకా క్రీజులోకి ఎంటర్ కాలేదు. దీంతో స్మిత్ రన్ఔట్ అని కన్ఫామ్ గా అనుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే…మరోవైపు స్మిత్ నిరాశగా
పెవీలియన్ వైపు మళ్లాడు. అయితే అందరూ అనుకుంది ఒకటైతే థర్డ్ ఎంపైర్ నిర్ణయం మరొక రకంగా రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రిప్లై ను పరిశీలించిన నితిన్..బెయిర్‌స్టో బాల్ తో వికెట్ని స్పీడ్ గా కొట్టినప్పటికీ బెయిల్స్ చాలా ఆలస్యంగా కింద పడటం గమనించారు.

దీంతో బెయిల్స్ కింద పడే సమయానికి తన బ్యాట్ ను క్రీజులో పెట్టారా లేదా అన్న అనుమానం కలిగిన నితిన్ వెంటనే ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. తన డిసిషన్ చెప్పడానికి నితిన్ కాస్త టైం తీసుకున్న…. అన్ని కోణాలలో సరిగ్గా పరిశీలించిన తర్వాత స్మిత్ క్రీజులో బ్యాట్ పెట్టే టైం కి బేల్స్ కింద పడలేదు అని స్పష్టికరించారు. కాబట్టి స్మిత్ అవుట్ కాదని నితిన్ డిక్లేర్ చేశారు. అలా ఆల్మోస్ట్ పెవిలియన్ వరకు వెళ్లి వెనక్కి వచ్చిన స్మిత్ హాఫ్ సెంచరీ చేసి ఈ మ్యాచ్లో ఆసీస్ జట్టుకు అండగా నిలిచాడు.

నితిన్ మీనన్ ప్లేస్ లో మరింక ఏ అంపైర్ ఉన్నా ఇంత క్షుణ్ణంగా పరిశీలించేవారు కాదని…అసలు ఈ కోణంలో ఆలోచించడం నిజంగా అతని సమయస్ఫూర్తికి నిదర్శనం అని క్రికెట్ విశ్లేషకులు నితిన్ ను పొగుడుతున్నారు. మరోపక్క నితిన్ కాకుండా అంపైర్ గా ఇంకా ఎవరైనా ఉండి ఉంటే కచ్చితంగా స్మిత్ ఔట్ అని డిక్లేర్ చేసేవారు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు నితిన్ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రశంసలు కురిపించారు.