https://oktelugu.com/

Bro Box Office Collection : పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ విధ్వంసం.. మూడు రోజుల్లోనే సెంచరీ కొట్టేశాడు బ్రో!

ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారైనా సినిమా చూడాల్సిందే అనే టాక్ రావడం, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ కావడంతో సినిమా వసూళ్లు బాగానే ఉన్నట్లు బయ్యర్ వర్గాలు చెపుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2023 / 01:04 PM IST

    Pawan Kalyan Bro Movie

    Follow us on

    Bro Box Office Collection : స్టార్ హీరో సినిమాకు ఉన్న ప్లస్ ఏమిటయ్యా అంటే ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా ఉంటాయి. మొదటి వీకెండ్ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఫుల్ అవుతాయి. దీని వలన మొదటి వారం వసూళ్లు కు ఎలాంటి ఢోకా ఉండదు. ఇక సినిమాకు మాత్రం మంచి రివ్యూస్ వస్తే సరికొత్త రికార్డ్స్ నమోదు అవుతాయి. అదే యావరేజ్ టాక్ వస్తే మాత్రం తక్కువలో తక్కువగా 150 కోట్లు మార్క్ రీచ్ అవుతుంది.

    తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లు మార్క్ ను తాకినట్లు తెలుస్తోంది. ముందే చెప్పుకున్నట్లు టాప్ హీరోలకు ఉన్న బెనిఫిట్ ఇదే. ఇక ‘బ్రో ‘ విషయానికి వస్తే మొదటి నుంచి ఫ్యాన్స్ పెద్దగా సినిమా మీద ఫోకస్ పెట్టలేదని చెప్పాలి. వాళ్ళ దృష్టి మొత్తం ఉస్తాద్, OG సినిమాల మీద ఉంది. పైగా తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం కూడా సినిమా వసూళ్ల విషయంలో కొంచెం ఇబ్బంది కలిగించాయి. లేకపోతే మొదటి 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ క్రాస్ అయ్యేది.

    ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారైనా సినిమా చూడాల్సిందే అనే టాక్ రావడం, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ కావడంతో సినిమా వసూళ్లు బాగానే ఉన్నట్లు బయ్యర్ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఏ సినిమా అయిన మొదటి వారం వసూళ్లు బాగానే సాధిస్తాయి. ఆ సినిమా రన్ ఎంతవరకు ఉంటుందో తెలిసేది సోమవారం.. మండే టెస్ట్ లో కానీ “బ్రో” సినిమా పాస్ అయితే మాత్రం ఫుల్ రన్ లో దాదాపు 175 కోట్లు సాధించే అవకాశం ఉంది. లేకపోతే 150 కోట్ల దగ్గర ఆగిపోవచ్చు.

    ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ లిస్ట్ లో మరో రికార్డు వచ్చి చేరింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 5 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో ఉన్నాయి. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఈ లిస్ట్ లో ఉన్నాయి. తాజాగా ‘బ్రో’ సినిమా వంద కోట్లు సాధించిన పవన్ కళ్యాణ్ 6 వ సినిమాగా నిలిచింది. పవన్ నుంచి వచ్చే సినిమాలు ఈజీగా 100 కోట్ల క్లబ్ చేరడం ఖాయం. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం “OG” సినిమా పవర్ స్టార్ కెరీర్ లోనే భారీ సినిమాగా ఉండబోతుందని నమ్మకంతో ఉన్నారు.