Homeఎంటర్టైన్మెంట్Childhood Photo: లడ్డూలా ఉన్న ఈ పాప ఇప్పుడు నాజూకు బాలీవుడ్ హీరోయిన్.. పెళ్లయినా తగ్గని...

Childhood Photo: లడ్డూలా ఉన్న ఈ పాప ఇప్పుడు నాజూకు బాలీవుడ్ హీరోయిన్.. పెళ్లయినా తగ్గని స్టార్ ఇమేజ్.. ఎవరో చెప్పుకోండి..

Childhood Photo: సౌత్ నుంచి వెళ్లి నార్త్ ను ఏలే హీరోయిన్లు నాటి నుంచే ఉన్నారు. ఆనాటి శ్రీదేవి నుంచి నేటి రష్మికా మందానా వరకు సౌత్ కు చెందిన వాళ్లే. మొదట్లో ఇక్కడ కొన్ని సినిమాల్లో నటించిన వీళ్లు ఆ తరవాత ఏకంగా బాలీవుడ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చి.. అక్కడే సెటిలయ్యారు. అయితే వారి గురించి తెలుసుకుంటే గానీ వారిక్కడి వారని తెలియడం లేదు. అలాంటి ఓ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ ను దున్నేస్తుంది. సాధారణంగా కొందరు పెళ్లయిన తరువాత సినిమాలు మానేస్తారు. కానీ ఈ భామ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఓ వైపు భర్త స్టార్ హీరో.. మరోవైపు ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీకి చెందిన చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో తెలుసా?

దీపికా పదుకొణే సౌత్ ఇండస్ట్రీ మాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ను స్టార్ట్ చేసిందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె కన్నడంలో ‘ఐశ్వర్య’ అనే సినిమాలో మొదటిసారిగా నటించింది. ఆ తరువాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ‘ఓం శాంతి ఓం’ అనే సినిమాలో నటించి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ అనతి కాలంలోనే పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. 2022లో మేనెల 17 నుంచి 28 వరకు జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివెల్ లో అమ్మడు కాంపీటీషన్ జ్యూరీ సభ్యురాలిగా కూడా నియమితులై ఆకట్టుకున్నారు.

దీపికా పదుకొణే కుటుంబంది బెంగుళూరు. 1986 జనవరి 5న ఆమె జన్మించింది. బెంగుళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన ఈమె ఆ తరువాత మౌంట్ కార్మెల్ కళాశాలలో చదువును పూర్తి చేసింది. మొదట్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీపై మనసు పారేసుకుంది. దీంతో మోడల్ రంగంలో అడుగుపెట్టింది. కొన్నాళ్ల పాటు పలు అడ్డర్టయిజ్మెంట్లలో నటించింది. మేబెల్లిన్ అనే కాస్మొటిక్ కంపెనీ ఆమెను అంతర్జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది.

అప్పట్లో హీమేష్ రేష్మియా సాంగ్స్ ఊర్రూతలూగించింది. ఆయన తీసిన ‘ఆప్ కా సరూర్’ అనే అల్బమ్ లో దీపికా పదుకొనే నటించడంతో ఆడియన్స్ కు పరిచయం అయింది. ఆ తరువత 2006లో ఉపేంద్ర హీరోగా వచ్చిన ‘ఐశ్వర్య’ అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా మొదటిసారిగా నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా రెండో మూవీనే షారుఖ్ ఖాన్ తోనటించే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఆమె అంతర్జాతీయగా ప్రఖ్యాతి పొందింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version