రోహిత్ శర్మ సహా క్రికెటర్లకు కరోనా టెస్ట్.. ఏం తేలిందంటే?

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు ఇటీవల బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి బయట ఓ రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు పెద్ద దుమారం చెలరేగింది. రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్ కు పంపించి వేరుగా ఉంచారు. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్ మెంట్ తాజాగా ఐసోలేషన్ లోని ఐదుగురు క్రికెటర్లు సహా.. భారత జట్టు సభ్యులందరికీ నిన్న కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్.టీ.పీ.సీ.ఆర్ పరీక్షల ఫలితాలు […]

Written By: NARESH, Updated On : January 4, 2021 10:03 am
Follow us on

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు ఇటీవల బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి బయట ఓ రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు పెద్ద దుమారం చెలరేగింది. రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్ కు పంపించి వేరుగా ఉంచారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్ మెంట్ తాజాగా ఐసోలేషన్ లోని ఐదుగురు క్రికెటర్లు సహా.. భారత జట్టు సభ్యులందరికీ నిన్న కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్.టీ.పీ.సీ.ఆర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఇందులో రోహిత్ శర్మ సహా ఐదుగురితోపాటు భారత ఆటగాళ్లు.. జట్టు సహాయక సిబ్బందికి కూడా నెగెటివ్ వచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది.

ఈ క్రమంలోనే జట్టుతోపాటే ఆ ఐదుగురు ఆటగాళ్లు కూడా ఒకే విమానంలో సిడ్నీకి వెళ్లినట్లు బీసీసీఐ తెలిపింది. ఈనెల 7 నుంచి సిడ్నీలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్ట్ జరుగనుంది.

ఇక రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమిండియాపై వివాదాలు ముసురుకున్నాయి. రోహిత్ సహా ఐదుగురు క్రికెటర్లు బయటకు వెళ్లడం.. కరోనా నిబంధనలను వారు ఉల్లంఘించారని మీడియా ప్రచారం చేసింది. వారిని ఐసోలేషన్ లో పెట్టడం కూడా వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే నాలుగో టెస్ట్ జరిగే బ్రిస్బేన్ లోనూ భారత క్రికెట్ జట్టు క్వారంటైన్ లో ఉంటూ ఆడమని.. వేదికను మార్చాలని కోరడం సిరీస్ మనుగడపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.