Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Nz Women Odi: పురుషుల వల్ల కానిది.. మహిళలు చేసి చూపించారు.. న్యూజిలాండ్...

Ind Vs Nz Women Odi: పురుషుల వల్ల కానిది.. మహిళలు చేసి చూపించారు.. న్యూజిలాండ్ జట్టును నేలకు దించారు.. సిరీస్ భారత్ సొంతం

Ind Vs Nz Women Odi: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడవ వన్డేలో న్యూజిలాండ్ జట్టు పై భారత్ విజయం సాధించింది. తొలి వన్డే లోనూ గెలిచిన నేపథ్యంలో సిరీస్ టీమిండియా సొంతమైంది.. సిరీస్ ను నిర్ణయించే మూడవ వన్డేలో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేస్తుంది. వైస్ కెప్టెన్ స్మృతి 122 బంతుల్లో 100 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఆమె ఇన్నింగ్స్ లో పది ఫోర్లు ఉన్నాయి. జట్టు విజయంలో ఆమె కీలకపాత్ర పోషించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 232 రన్స్ చేసింది. బ్రూక్ హాలిడే 86, జార్జియా ప్లిమ్మర్ 39 పరుగులు చేశారు. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. మిశ్రా రెండు వికెట్లు సాధించింది. రేణుక సింగ్, సైమా చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఆకాశమే హద్దుగా..

అనంతరం టార్గెట్ ను చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన భారత జట్టు 45.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 236 రన్స్ చేసింది. స్మృతి మందాన సెంచరీ చేసింది. కెప్టెన్ హర్మన్ 70* పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో హన్నా రెండు వికెట్లు పడగొట్టింది. సోఫియా డివైన్, ఫ్రాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 233 పరుగుల టార్గెట్ చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (12) దారుణంగా నిరాశపరిచింది. యస్తిక భాటియా, స్మృతి మందాన టీమిండియా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. రెండవ వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. యాస్తిక సోఫియా డివైన్ బౌలింగ్లో ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ క్రీజ్ లోకి వచ్చింది. స్మృతి, హర్మన్ ఆకాశమే హద్దుగా ఆడారు. ఈ క్రమంలో స్మృతి 73 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది. ఆ తర్వాత దూకుడుగా ఆడింది. హర్మన్ 54 బంతుల్లో అర్థ సెంచరీ చేసింది. స్మృతి 121 బాల్స్ లో శతకం పూర్తిచేసుకుంది. ఆ తర్వాత స్మృతి అవుట్ అయినప్పటికీ.. జెమీమా రోడ్రిగ్స్ (11) మిగతా లాంచనాన్ని పూర్తిచేసే క్రమంలో అవుట్ అయింది. ఆ తర్వాత తేజల్ తో కలిసి కెప్టెన్ హర్మన్ మిగతా తంతును విజయవంతంగా పూర్తి చేసింది. టి20 వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి ఈ విజయం ద్వారా భారత జట్టు బదులు తీర్చుకుంది. మొత్తంగా టి20 వరల్డ్ కప్ విజేతను నేల నాకించింది. ఇన్నాళ్లపాటు విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు ఇప్పుడు కాస్త ఉపశమనాన్ని దక్కించుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular