IND Vs PAK (11)
IND vs PAK: పాకిస్తాన్ కోరుకున్నట్టుగా అద్భుతం జరగలేదు. బ్రహ్మాండం బద్దలు కాలేదు. రొటీన్ స్టోరీనే మళ్లీ రిపీట్ అయింది. కాకపోతే ఈసారి టీమిండియా రివెంజ్ తీర్చుకుంది. 2017 నాటి ఓటమికి గుణపాఠం చెప్పింది. సొంత దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్తాన్ ను ఇంటికి పంపించింది.
IND vs PAK: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక దుబాయ్ లోనూ అదే జోరు కొనసాగించింది. ఈ మైదానంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ రిజ్వాన్ మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ప్లాట్ పిచ్ పై భారత బౌలర్లు పండగ చేసుకున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లను ఏ దశలోనూ భారీ షాట్లు ఆడకుండా చేశారు. భారీగా పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఫలితంగా పాకిస్తాన్ 241 పరుగులకే ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ జట్టులో షకీల్ 62, రిజ్వాన్ 46 పరుగులు చేశారు. వీరిద్దరే టాప్ స్కోరర్లు గా నిలిచారు. ఇక భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించాడు.
242 పరుగుల టార్గెట్ తో..
242 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేదించింది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. 111 బంతులు ఎదుర్కొన్న అతడు ఏడు ఫోర్ల సహాయంతో సెంచరీ చేశాడు. మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిడియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి.. దూకుడుగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు.. మరో ఆటగాడు గిల్ కూడా 46 పరుగులు చేసి.. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ దశలో అయ్యర్, విరాట్ కోహ్లీ మూడో వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 56 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో వచ్చిన హార్దిక్ పాండ్యా పరుగులు చేసి షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికే టీం ఇండియా గెలుపు లాంచనమైంది. ఈ దశలో వచ్చిన అక్షర్ పటేల్ మూడు పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో ఉన్న విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత సెంచరీ చేయడంతో విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు చేతిలో ఫైనల్ లో భారత్ ఓడిపోయింది. నాటి నుంచి రివెంజ్ తీర్చుకుంటూనే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 t20 వరల్డ్ కప్ లో టీం ఇండియా విజయం సాధించింది. ఈ విజయాల ద్వారా పాకిస్తాన్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది.