Homeక్రీడలుIndia Wins Hockey Asia Cup 2025: హాకీ లో భారత్ సరికొత్త చరిత్ర.. మన...

India Wins Hockey Asia Cup 2025: హాకీ లో భారత్ సరికొత్త చరిత్ర.. మన ఇంటి క్రీడకు మంచి రోజులు వచ్చినట్టేనా?

India Wins Hockey Asia Cup 2025: హాకీ.. మన దేశ జాతీయ క్రీడ. వాస్తవానికి చాలామంది మన నేషనల్ గేమ్ అంటే క్రికెట్ అనుకుంటారు. ఎందుకంటే క్రికెట్ ఆస్థాయిలో మన దేశంలో ప్రాచుర్యం పొందింది. దీంతో హాకీ అంతగా ఆదరణకు నోచుకోవడం లేదు. అయినప్పటికీ ఔత్సాహిక క్రీడాకారులు హాకీ ఆడుతూనే ఉన్నారు. ప్రపంచ యవనిక మీద మన దేశ పరువును నిలబెడుతూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఆసియా కప్ లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. దాదాపు ఎన్ని సంవత్సరాల తర్వాత విజేతగా ఆవిర్భవించేలా చేశారు.

సౌత్ కొరియా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. డిపెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాకు చుక్కలు చూపించారు. డిఫెన్స్ లో సరికొత్త ఆట తీరు ప్రదర్శిస్తూ.. సౌత్ కొరియా ప్లేయర్లను డోలాయమనంలో పడేశారు. ముఖ్యంగా పాసింగ్.. డిఫెన్స్.. రైసింగ్ షాట్స్ కొట్టి అదరగొట్టారు. ఫలితంగా సౌత్ కొరియా స్కోరు కేవలం ఒక్క గోల్ కు మాత్రమే పరిమితమైంది. వాస్తవానికి భారత డిఫెన్స్ ను చేయించుకొని గోల్స్ చేయాలంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పదేపదే భారత గోల్ పోస్ట్ మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

భారత ప్లేయర్ల ఫామ్ కూడా ఈ మ్యాచ్లో కలిసి వచ్చింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత తుది పోరులో ఆడుతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే విజయం సాధించాలని కసి ఆటగాళ్లలో పెరిగింది. అందువల్లే ప్రతి నిమిషం భారత ఆటగాళ్ల ఆట తీరు సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో భారత ప్లేయర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రత్యర్థి ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంతిని పాస్ చేశారు. ఒకరకంగా ఈ స్థాయిలో ఆడడం భారత అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఏకంగా నాలుగు గోల్స్ కొట్టి.. అత్యధి జట్టుకు ఒకే ఒక గోల్ చేసే అవకాశం కల్పించింది భారత జట్టు. ద్వారా మ్యాచ్ మొత్తాన్ని ఏకపక్షం చేసింది.

ఈ విజయం ద్వారా భారత్ వరల్డ్ కప్ బెర్త్ సొంతం చేసుకుంది. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభం నుంచి మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా సౌత్ కొరియాకు గోల్ చేసే అవకాశాన్ని టీమిండియా ఇవ్వలేదు. చివర్లో మ్యాచ్ ముగుస్తుందనుకుంటున్న క్రమంలో మరీ సున్నాతో ఓడిపోతే బాగోదని భావించిన సౌత్ కొరియా జట్టు.. ఒకే ఒక్క గోల్ చేసింది. దీంతో ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించుకుంది. అంత తప్ప ఓటమిని కాదు. ఈ ఓటమి ద్వారా సౌత్ కొరియా ఆట తీరుపై విమర్శలు వస్తుంటే.. ఈ గెలుపు ద్వారా భారత జట్టు ఆట తీరుపై ప్రశంసలు లభిస్తున్నాయి.. ఇదే జోరు కొనసాగించాలని.. వరల్డ్ కప్ అందుకోవాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular