Zimbabwe vs India : ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టులో సత్తా చాటిన యువ ఆటగాడు రియాన్ పరాగ్ టీమిండియా టి20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. జింబాబ్వే వేదికగా జరుగుతున్న 5 t20 ల సిరీస్ లో అతడు జాతీయ జట్టులో ఆడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ప్రారంభమైన తొలి టి20 మ్యాచ్ ద్వారా అతడు టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దూకుడైన ఆట తీరును ప్రదర్శించే రియాన్ పరాగ్ కు బిసిసిఐ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దీంతో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు.
టాస్ ప్రక్రియకు ముందు టీమిండియాలో కొత్తగా ప్రవేశించిన ఆటగాళ్లకు అఫీషియల్ క్యాప్ అందజేస్తారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు కోచ్ టీమ్ ఇండియా క్యాప్ అందజేస్తాడు. అయితే ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియడం.. కొత్త కోచ్ ను ఇంకా ఎంపిక చేయకపోవడంతో రియాన్ పరాగ్ కు అతడి తండ్రితో టీమిండియా క్యాప్ ధరింపజేశారు. ఈ అనుకోని సర్ప్రైజ్ కు రియాన్ పరాగ్ ఆనందంతో పరవశించిపోయాడు. రియాన్ పరాగ్ తండ్రి స్వస్థలం అస్సాం. ఇతడు క్లాస్ వన్ క్రికెటర్ గా ఆడాడు. ఆ తర్వాత రైల్వే శాఖలో ఉద్యోగం రావడంతో క్రికెట్ కు దూరంగా ఉండిపోయాడు. అయితే అతడికి టీమ్ ఇండియాకు ఆడాలని కోరిక ఉండేది. రియాన్ పరాగ్ ద్వారా ఆ కోరిక తీరడంతో అతడు కూడా ఉబ్బితబ్బిబవుతున్నాడు. తన కొడుకుకు క్యాప్ ధరింపజేస్తూ గర్వాన్ని ప్రదర్శించాడు. ఈ ఫోటోను పలువురు టీమిండియా అభిమానులు తమ సోషల్ మీడియా ఖాతాలలో అప్లోడ్ చేసి.. రియాన్ పరాగ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రియాన్ పరాగ్ 2023 ఐపీఎల్ లో విపరీతంగా ట్రోల్ అయ్యాడు. సిక్స్ కొట్టినప్పుడు, అర్థ సెంచరీ బాదినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు రకరకాల హావభావాలను ప్రదర్శించేవాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిని ఒక ఆట ఆడుకునేవారు. అయితే 2024 ఐపిఎల్ లో తన ఆట తీరును పూర్తిగా మార్చుకున్నాడు రియాన్ పరాగ్. రాజస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఆవిర్భవించాడు. ఆ జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా మొదటి స్పెల్ లో రాజస్థాన్ వరుసగా విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక వహించాడు. అతని ఆట తీరు చూసి బిసిసిఐ జింబాబ్వే టూర్ కు ఎంపిక చేసింది. ఇటీవల టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పోటీ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. దీంతో వారి స్థానంలో ఎవర్ని నియమిస్తే బాగుంటుందో.. 2026 లో జరిగే టి20 వరల్డ్ కప్ కు ఎవర్ని ఎంపిక చేస్తే ఉపయుక్తంగా ఉంటుందో బీసీసీఐ ఇప్పటికే ట్రయల్స్ మొదలుపెట్టింది. అందువల్లే రియాన్ పరాగ్ లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది.. వారు జింబాబ్వే టూర్ లో రాణించిన దానిని బట్టే వారి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
Riyan Parag's father presented the India cap to Riyan Parag. ❤️
– Parag Das is a former First Class Cricketer of Assam, son is living the dream of his father. pic.twitter.com/agFfNsQdII
— Johns. (@CricCrazyJohns) July 6, 2024