Anant Ambani – Radhika : రోహిత్, హార్దిక్, సూర్యకు అంబానీ కుటుంబం ఘన స్వాగతం.. వీడియో వైరల్

Anant Ambani - Radhika : ఇక అంబానీ కుటుంబం సూర్య, హార్దిక్, రోహిత్ కు పలికిన స్వాగతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Written By: NARESH, Updated On : July 6, 2024 7:27 pm

Anant Ambani - Radhika

Follow us on

Anant Ambani – Radhika : 17 సంవత్సరాల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది. ఈ విజయం నేపథ్యంలో టీమిండియా సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే బీసీసీఐ టీమ్ ఇండియా ఆటగాళ్లకు ఘనంగా సన్మానం చేసింది. ముంబై మహానగరంలో విక్టరీ పరేడ్ నిర్వహించింది. అనంతరం 125 కోట్ల విలువైన చెక్కును అందజేసింది. టి20 వరల్డ్ కప్ లో సాధించిన విజయం అనంతరం టీమిండియాలో కీలకమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ విజయం అనంతరం ప్రస్తుతం టీమిండియా యువ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. 5 t20 ల మ్యాచ్ సిరీస్ లో భాగంగా శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ లో తొలి మ్యాచ్ ఆడుతోంది..

టి20 వరల్డ్ కప్ లో అద్భుతంగా ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ ను అంబానీ కుటుంబం ఘనంగా సన్మానించింది. శుక్రవారం రాత్రి జియో వరల్డ్ సెంటర్ లో జరిగిన అనంత్ అంబానీ – రాధిక సంగీత్ కార్యక్రమంలో వారికి సాదర స్వాగతం పలికింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ముందుండి వారికి స్వాగతం పలికారు. అర్చకులు వేదమంత్రాలు చదివారు.. సంగీత్ జరిగే వేదికపై హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాను సన్మానించారు..
అనంతరం హార్దిక్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా పూజలు చేశారు.. సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యా ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడారు. ఈ సీజన్ లో ముంబై జట్టు ఆశించన స్థాయిలో విజయం సాధించలేదు. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది..

ఇక టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్ లో రెండు వికెట్లను పడగొట్టి.. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమ్ ఇండియాలో విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించిన అనంతరం హార్దిక్ పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు. అతడిని రోహిత్ శర్మ గట్టిగా హత్తుకుని శుభాకాంక్షలు తెలియజేశాడు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెట్టాడు. ఇక అంబానీ కుటుంబం సూర్య, హార్దిక్, రోహిత్ కు పలికిన స్వాగతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.