India vs South Africa: మన అమ్మాయిల చేతిలోనూ దక్షిణాఫ్రికా చిత్తు.. అసలు హైలెట్ ఇదే..

India vs South Africa: ఏకైక టెస్టులో సఫారీలను పది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇప్పటికే వన్డే సిరీస్ ను 3-0 తో గెలుచుకున్న భారత మహిళల జట్టు.. ఏకైక టెస్టులో విజయం సాధించి.. సత్తా చాటింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 1, 2024 5:32 pm

India thrash South Africa by 10 wickets

Follow us on

India vs South Africa: టి20 వరల్డ్ కప్ ఫైనల్లో మెన్స్ జట్టు చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయి.. దక్షిణాఫ్రికా జట్టు ట్రోఫీని వదిలేసుకుంది. పురుషుల జట్టు టీ 20 ఫైనల్లో విజయం సాధిస్తే.. టీమిండియా మహిళల జట్టు.. ఏకైక టెస్టులో సఫారీలను పది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇప్పటికే వన్డే సిరీస్ ను 3-0 తో గెలుచుకున్న భారత మహిళల జట్టు.. ఏకైక టెస్టులో విజయం సాధించి.. సత్తా చాటింది.

చెన్నై వేదిక జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత మహిళల జట్టు పది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై అద్భుతమైన విజయాన్ని సాధించింది..232/2 తో సోమవారం రెండవ ఇన్నింగ్స్ (ఫాలో ఆన్) ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు ఎదుట 37 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ ను భారత క్రీడాకారిణులు ఆడుతూ పాడుతూ చేదించారు. 9.2 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసి టీమ్ ఇండియాకు గ్రాండ్ విక్టరీ అందించారు. టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ(24*) , శుభా సతీష్ (13) పరుగులు చేశారు.

ఇక ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత మహిళల జట్టు 603/6(ఇన్నింగ్స్ డిక్లేర్డ్) స్కోరు సాధించింది షఫాలీ వర్మ(205: 137 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లు), డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకుంది. స్మృతి మందాన (149: 161 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (69: 115 బంతుల్లో నాలుగు ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్(55: 94 బంతుల్లో 8ఫోర్లు ) సత్తా చాటారు.

ఇక టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ స్నేహ్ రాణా 8/77 అదరగొట్టడంతో.. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 84.3 ఓవర్లలోనే 266 పరుగులకు కుప్పకూలింది. కాప్(74), లూస్(65) మాత్రమే ఆకట్టుకోవడంతో సౌత్ ఆఫ్రికా ఫాలో ఆన్ లో పడింది. దీంతో రెండవ దక్షిణాఫ్రికా క్రీడాకారిణులు వోల్వార్ట్(122), లూస్(109) శతకాలు కొట్టారు. డిక్లెర్క్(61) అర్ద సెంచరీ తో ఆకట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్, షఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.. టీమిండియా పురుషుల జట్టు టి20 ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పై గెలిచి కప్ దక్కించుకోవడం, మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్ ను వైట్ వాష్ చేయడం, ఏకక టెస్ట్ మ్యాచ్ ను కూడా గెలుచుకోవడం విశేషం.