India Vs South Africa Final: భారత్ vs సౌత్ ఆఫ్రికా.. జ్యోతిష్యులు చెప్పేశారు.. టి20 వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టేనటా?

ప్రస్తుత టి20 ప్రపంచ కప్ కూడా జూన్ నెలలోనే జరుగుతోంది. ఆ తేదీని మొత్తం కూడితే 25 వస్తుంది. దీంతో భారత జట్టు మరోసారి విజేతగా నిలుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 29, 2024 6:55 pm

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: మరికొద్ది గంటల్లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. సౌత్ ఆఫ్రికా – టీమిండియా టైటిల్ కోసం తలపడనున్నాయి. టి20 వరల్డ్ కప్ చరిత్రలో అటు టీమిండియా, ఇటు దక్షిణాఫ్రికా ఒక్క ఓటమి కూడా చవి చూడకుండా ఫైనల్ దాకా వచ్చాయి. 2007లో టి20 వరల్డ్ కప్ దక్కించుకున్న టీమిండియా.. మరోసారి ట్రోఫీ అందుకోలేకపోయింది. ఇక దక్షిణాఫ్రికా కూడా ఇంతవరకు టి20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టలేదు. అయితే టీమిండియా కచ్చితంగా ట్రోఫీ గెలవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన నేపథ్యంలో.. టి20 వరల్డ్ కప్ సాధించి.. ఆ బాధను దూరం చేయాలని రోహిత్ సేనను అభ్యర్థిస్తున్నారు.

ఇక జ్యోతిష్యులు సైతం టీ20 వరల్డ్ కప్ ఏ జట్టు సాధిస్తుందో ముందే చెప్పేస్తున్నారు. దక్షిణాఫ్రికా వరుస విజయాలతో ఫైనల్ చేరుకున్నప్పటికీ.. భారత జట్టు విజయం సాధిస్తుందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. జూన్ నెల, 25వ నెంబర్ టీమ్ ఇండియాకు కలిసి వస్తుందని.. ప్రపంచ కప్ కచ్చితంగా రోహిత్ సేన దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు.. భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ జరిగే తేదీ 29 -6-2024 . ఈ తేదీలో ప్రతి అంకెను కలిపి కూడితే 25 వస్తుంది.. టీమిండియా తొలి వన్డే ప్రపంచ కప్ ను 1983 జూన్ 25న గెలుచుకుంది.

ఇక ప్రస్తుత టి20 ప్రపంచ కప్ కూడా జూన్ నెలలోనే జరుగుతోంది. ఆ తేదీని మొత్తం కూడితే 25 వస్తుంది. దీంతో భారత జట్టు మరోసారి విజేతగా నిలుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఇక ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐసిసి టోర్నీలలో ఫైనల్ చేరడం సౌత్ ఆఫ్రికాకు ఇదే తొలిసారి. 2014లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో మార్క్రమ్ ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికా విజేతగా ఆవిర్భవించింది. డికాక్, స్టబ్స్, మిల్లర్, క్లాసెన్ లాంటి భీకరమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. రబాడ, నోకియా, శంసి వంటి బౌలర్లు మెలికలు తిప్పగలరు.