Ind Vs SA Final: శని గాడు వచ్చాడ్రా.. ఇక టీమిండియా గెలిచేది కష్టమే..

గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా రిచర్డ్ కేటిల్ బరో అంపైర్ గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో టీమిండియా భారత్ చేతిలో ఓడిపోవడానికి అతడు పరోక్షంగా కారణమయ్యాడని అభిమానులు ఆరోపిస్తూ ఉంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 29, 2024 6:13 pm

Ind Vs SA Final

Follow us on

Ind Vs SA Final: మరికొద్ది గంటల్లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్ లోనే బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. దక్షిణాఫ్రికా – టీమిండియా జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఒక ఓటమి కూడా ఎదుర్కోకుండా ఫైనల్ దాకా వచ్చాయి.. 2007లో టి20 వరల్డ్ కప్ దక్కించుకున్న టీమిండియా.. ఇంతవరకు మరొక కప్ అందుకోలేకపోయింది. ఇక దక్షిణాఫ్రికా ఇంతవరకు ఐసీసీ ట్రోఫీని దక్కించుకోలేకపోయింది. తొలిసారిగా ఆ జట్టు టి20 వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ లో సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి.

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి మొదలవుతుంది.. ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీని సగర్వంగా ఒడిసి పట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు భారత జట్టు విజయాలపై నీళ్లు చల్లేందుకు.. అభిమానులను ఒత్తిడికి గురి చేసేందుకు ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంది.. ఈ మ్యాచ్ లో ఎంపైర్ గా రిచర్డ్ కెటిల్ బరోను నియమించింది.. ఇతడు భారత్ ఆడే నాకౌట్ మ్యాచ్ లలో అంపైర్ గా ఉంటే.. అభిమానులు ఆ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంటారు..కేటిల్ బరో అంపైర్ గా వ్యవహరించిన మ్యాచ్ లలో సింహభాగం టీమిండియా ఓడిపోయింది. ఇతడికి టీమిండియా పాలిట ఐరన్ లెగ్ అని పేరు ఉంది.. ఇండియా – సౌత్ ఆఫ్రికా ఆడే ఫైనల్ మ్యాచ్ కి కూడా ఇతడే ఎంపైర్. అయితే ఇతడిని ఫీల్డ్ అంపైర్ లా కాకుండా టీవీ అంపైర్ గా ఐసీసీ నియమించింది.

గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా రిచర్డ్ కేటిల్ బరో అంపైర్ గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో టీమిండియా భారత్ చేతిలో ఓడిపోవడానికి అతడు పరోక్షంగా కారణమయ్యాడని అభిమానులు ఆరోపిస్తూ ఉంటారు. ఇక గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ అతడు అంపైర్ గా ఉన్నాడు. ఆ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు. ఇక 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఐసీసీ టోర్నమెంట్ లలో టీమిండియా ఆడిన నాకౌట్ మ్యాచ్లలో రిచర్డ్ అంపైర్ గా వ్యవహరిస్తున్నాడు. ఫీల్డ్ లేదా టీవీ లేదా ఫోర్త్ ఎంపైర్ గా వ్యవహరించాడు. అయితే అతడు అంపైర్ గా వ్యవహరించిన ప్రతి నాకౌట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. అయితే ఇదే ఇప్పుడు భారత అభిమానులను ఇబ్బందికి గురిచేస్తోంది.

2011 తర్వాత భారత్ మరోసారి వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. 2007 తర్వాత భారత్ ఇంకోసారి టి20 వరల్డ్ కప్ దక్కించుకోలేదు. ఈసారైనా టి20 వరల్డ్ కప్ దక్కించుకోవాలని భావిస్తుంటే రిచర్డ్ రూపంలో శని రోహిత్ సేన పక్కనే ఉందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే రిచర్డ్ సెంటిమెంట్ ను టీమిండియా అధిగమిస్తుందో.. లేక అదే కొనసాగుతుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.