https://oktelugu.com/

Pawan Kalyan: పిక్ ఆఫ్ ది డే : హనుమంతుడి ఒడిలో ‘పవను’డు…

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో తన మార్కును చూపించడానికి రెడీ అవుతున్నాడు. అయినప్పటికీ తను ఎక్కడా కూడా సినిమాలను వదిలేస్తున్నాను అని చెప్పడం లేదు.

Written By: , Updated On : June 29, 2024 / 07:17 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: చాలా మంది హీరోలు సినిమాలు చేయడం ఒక ఎత్తైతే…ఒక హీరో నుంచి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకోసం అభిమానులు ఎదురుచూసే స్థాయిలో ఆ హీరో స్టార్ డమ్ ఉండటం అనేది మరొక ఎత్తు.ఇక ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా హీరోలు సైతం ఆయన క్రేజ్ ముందు దిగదుడుపే…

అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో తన మార్కును చూపించడానికి రెడీ అవుతున్నాడు. అయినప్పటికీ తను ఎక్కడా కూడా సినిమాలను వదిలేస్తున్నాను అని చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన ఆ స్టేజ్ లో ఉండడానికి కారణం సినిమాలే కాబట్టి తన ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా అయినా సరే తను తీసి తన అభిమానులను అనందపడేలా చేయాలని చూస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ దేవుళ్లను ఎక్కువగా నమ్ముతున్నాడు. తన ఎలక్షన్స్ క్యాంపెనింగ్ కోసం కొనుక్కున్న వాహనానికి ‘వారాహి’ అనే పేరు పెట్టాడు.

అలాగే దానికి పూజా కార్యక్రమాలను తెలంగాణ లోని కొండగట్టు దేవాలయం లో నిర్వహించి అక్కడ కొలువైన ఆంజనేయ స్వామి ఆశీస్సులను ప్రసన్నం చేసుకున్నాడు. ఇక ఆయన ప్రచారం కూడా కొండగట్టు నుంచే మొదలుపెట్టడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సిఎం గా ఉంటూనే పలు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక అతను అనుకున్నట్టుగానే పాలిటిక్స్ లో మంచి సక్సెస్ అయితే వచ్చింది.

కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులను తీసుకున్నాడు. ఇక ‘హనుమంతుడి ఒడి లో పవన్ కళ్యాణ్’ అంటూ ఒక పిక్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది.. ఇక ఈ ఫోటోను ప్రస్తుతం పిక్ ఆఫ్ ది డే గా కూడా పిలుస్తున్నారు… ఇక అతనితో పాటు ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో కొండగట్టుకు వచ్చి దేవుడి దర్శనాన్ని చేసుకున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.