India Vs South Africa 3rd T20: ఆయన ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. సంజు ఆట తీరు మాత్రం బాగోలేదు. ఇలా రాయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్ లో సూపర్ సెంచరీ తో సంజు ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టి20 సిరీస్లో తొలి మ్యాచ్లో సెంచరీ చేశాడు. జట్టును గెలిపించాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ వరుసగా రెండు మ్యాచ్లలో 0 పురుగులకు అవుట్ అయ్యాడు. సహజంగానే ఇలాంటి స్థితిలో ఏ ఆటగాడి పైనైనా విమర్శలు వ్యక్తం అవుతుంటాయి. దీనికి సంజు కూడా మినహాయింపు కాదు.. ఇటీవల అతడి తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన ఆరోపణలు చేశాడు.” నా కొడుకు గొప్ప ఆటగాడు. బంగ్లాదేశ్ జట్టుపై సెంచరీ చేస్తే క్రిష్ శ్రీకాంత్ అనే ఆటగాడు నా కొడుకు పై లేనిపోని ఆరోపణలు చేశాడు. పోనీ అతడేమైనా గొప్ప ఆటగాడు అంటే అదీ లేదు. నా కుమారుడిపై అనవసరంగా విమర్శలు చేశాడు. సెంచరీ చేసినందుకు అభినందించక పోయినా పర్వాలేదు. కానీ ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని” శాంసన్ విశ్వనాథ్ వాపోయాడు. ఒక తండ్రిగా అతని ఆవేదన అర్థం చేసుకోవచ్చు. కానీ వరుసగా రెండు మ్యాచ్లలో సున్నాలకే అవుట్ అయితే ఎలా? అది కూడా జట్టులో తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో.. వెనుతిరిగితే ఎలా.. ఇప్పటికే అభిషేక్ శర్మ వరుసగా విఫలమౌతూ జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు మూడవ టి20 మ్యాచ్లో స్థిరంగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు అతడు 22 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేశాడు. ఇక మరో ఆటగాడు తిలక్ వర్మ 24 బంతులు ఎదుర్కొని 36 పరుగులు చేశాడు. కానీ సంజు మాత్రం దారుణంగా రెండు బంతులు ఎదుర్కొని మార్కో జాన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక ఆటగాడికి ఇలాంటి పరిస్థితి సర్వసాధారణమే అయినప్పటికీ.. సంజు తనను తాను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక జట్టుకు ఓపెనర్ మూల స్తంభం లాంటివాడు. అతడు గనుక వెంటనే విఫలమైతే.. ఆ ప్రభావం జట్టు మీద మొత్తం పడుతుంది. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఓపెనర్ గా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. ఫలితంగా దాని ప్రభావం జట్టు విజయాలపై ఎలా పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ పై టీమ్ ఇండియా మేనేజ్మెంట్ కు ఎంతో కొంత నమ్మకం ఉంది కాబట్టి సరిపోయింది. అదే సంజు విషయంలో అలాంటిది ఉండకపోవచ్చు. బహుశా నాలుగో టి20 లో కూడా సంజు ఇలానే ఆడితే అప్పుడు అతడి స్థానం టి20 జట్టులో ప్రశ్నార్దకమవుతుంది. అభిషేక్ శర్మకు అవకాశాలు ఇవ్వడం లేదా? అనే ప్రశ్న ఇక్కడ రావచ్చు. కానీ సంజు 2015 లోనే టి20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దానిని ఇక్కడ మర్చిపోవద్దు.
అంచనా వేయడంలో విఫలం
సంజు రెండు మ్యాచ్లలో వరుసగా సెంచరీలు చేశాడు. కానీ అదే ఉప్పు కొనసాగించలేకపోతున్నాడు. కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ లలో 0 పరుగులకు ఔటై పరువు తీసుకున్నాడు. రెండవ టి20 మ్యాచ్లో సంజు సున్నా పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా తీవ్రంగా ఇబ్బంది పడింది. హార్దిక్ పాండ్యా ఎంతో కొంత నిలబడ్డాడు కాబట్టి జట్టు ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. ఇక మూడవ టి20లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ నిలబడ్డారు కాబట్టి దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించే అవకాశం లేకుండా పోయింది. లేకుంటే ఇక్కడ కూడా రెండవ టి20 మ్యాచ్ సీన్ రిపీట్ అయ్యేది. ఇప్పటికైనా సంజు తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలి. ఆవేశానికి పోకుండా నింపాదిగా ఆడే ప్రయత్నం చేయాలి. అప్పుడే అతడి స్థానం జట్టులో సుస్థిరమవుతుంది. లేకుంటే కెరియర్ ప్రశ్నార్థకమవుతుంది.