India Vs Pakistan
India Vs Pakistan: టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్ పాకిస్తాన్ జట్టుతో ఆడనుంది. గ్రూప్ – ఏ లో ఈ రెండు జట్లు ఉన్నాయి. న్యూయార్క్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.. జూన్ 9న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే ఐసీసీ రికార్డు స్థాయిలో ధరకు (డైమండ్ జూబ్లీ టికెట్ 16 లక్షల అని ప్రచారం జరుగుతుంది) విక్రయించింది.. అదే హాట్ టాపిక్ అయితే.. ఇప్పుడు మరో విషయం వార్తల్లో నిలుస్తోంది. ఇంతకీ అదేంటంటే.
టీ – 20 వరల్డ్ కప్ టెలికాస్ట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది.. భారీ ధరకు ఈ హక్కులను కొనుగోలు చేసిన నేపథ్యంలో.. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో ప్రసారం చేసే యాడ్స్ కు భారీ స్థాయిలో వసూలు చేస్తోంది. ఇప్పటికే 90 శాతానికి పైగా యాడ్ స్లాట్ లు బుక్ అయ్యాయి. ఇంకా మరిన్ని సంస్థలు తమ యాడ్స్ ప్రసారం చేసేందుకు స్లాట్ లు బుక్ చేసుకుంటున్నాయి. టీవీలో మాత్రమే కాదు, ఓటీటీ లో కూడా ప్రకటనలు ప్రసారం చేసేందుకు స్లాట్ లు బుక్ అయ్యాయి.. అయితే ఈ వరల్డ్ కప్ లో స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మిగతా మ్యాచ్లకు తమ ప్రకటనల ప్రసార ధరలను స్థిరంగా ఉంచాయి.. కానీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఏకంగా 20 నుంచి 25% వరకు పెంచాయి.. 10 సెకండ్ల యాడ్ ప్రసారానికి దాదాపు 50 లక్షల దాకా వసూలు చేస్తున్నాయని జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
” భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా హైప్ ఉంటుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం క్యాష్ చేసుకుంటున్నది. మిగతా మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ కు 22 నుంచి 25% వరకు అధిక ప్రీమియాన్ని జత చేసింది.. ఈ ప్రకారం కార్పొరేట్ కంపెనీలు ఐదు నుంచి పది లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కొన్ని బ్రాండ్లు తమ ప్రమోషన్ కోసం భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను ఉపయోగించుకుంటున్నాయని” జాతీయ మీడియా సంస్థలు తమ కథనాలలో పేర్కొంటున్నాయి..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: India vs pakistan how much star sports is charging for 30 seconds
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com