Chandrababu: చంద్రబాబు కొత్త టీం రెడీ అవుతోంది. అటు మంత్రివర్గ కూర్పుతో పాటు అధికార గణం కూడా సిద్ధమవుతోంది. టిడిపి కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు పవన్ తో భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఢిల్లీ వెళ్లారు. అటు కేంద్ర మంత్రివర్గంలో టిడిపి కూటమి చేరికపై కూడా చర్చించారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీప్ నియామకంపై కూడా దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ 30 తో ముగుస్తుంది. అందుకే ఆయన స్థానంలో కొత్త వారి నియామకం చేపట్టనున్నారు. ఎప్పటికీ ఇంటలిజెన్స్ చీప్ పి ఎస్ ఆర్ ఆంజనేయులను ఎలక్షన్ కమిషన్ తప్పించింది. ఎన్నికలకు ముందే ఆయనకు స్థాన చలనం కల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ కు బాధ్యతలు అప్పగించడానికి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. టిడిపి ప్రభుత్వ హయాంలో కొద్దిరోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. విధేయతకు అనుకూలంగా పనిచేస్తారు అన్న పేరు ఉంది. సీనియారిటీ, సిన్సియారిటీ కలిగిన నేతగా గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ మ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన విజయానంద్ 1992లో బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. ప్రస్తుతం ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో పని చేయడం, విధేయత కలిగిన అధికారిగా గుర్తింపు పొందడంతో ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు సమాచారం.
కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ పోస్ట్ కు సీనియర్ అధికారి కోసం చంద్రబాబు అన్వేషించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. రైల్వేస్ డిజిపిగా వ్యవహరిస్తున్న బాలసుబ్రమణ్యం ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నారు.ఆయనను పిలిపించి ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా ఇంటలిజెన్స్ విభాగాన్ని వైసీపీ సర్కార్ సొంత అవసరాలకు వాడుకుంది. మరోవైపు వ్యవస్థలన్నీ గాడిలో పడాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ముఖ్యం. అందుకే చంద్రబాబు సీనియారిటీని, సిన్సియారిటీని పెద్దపీట వేస్తూ అధికారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.