India Vs New Zealand: దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాడిగా.. ప్రమాదకరమైన ప్లేయర్ గా డేవిడ్ మిల్లర్ కు పేరుంది. ఎలాంటి స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేసినా పరుగుల వరద పారిస్తాడు. అందువల్లే అతడిని దక్షిణాఫ్రికా అభిమానులు విపరీతంగా ఆరాధిస్తుంటారు. అక్కడ అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
Also Read: డ్రెస్సింగ్ రూంలో టెన్షన్.. హార్ధిక్ పాండ్యా నవ్వుకున్నాడట.. అదీ గట్స్ అంటే
డేవిడ్ మిల్లర్.. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సూపర్ సెంచరీ చేశాడు. సహచర ఆటగాళ్లు మొత్తం విఫలమవుతున్నప్పటికీ అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 63 బంతుల్లోనే మెరుపు వేగంతో సెంచరీ చేశాడు. ఒక రకంగా న్యూజిలాండ్ జట్టు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. చివరి వరకు వెంటాడిన అతడు తన సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. బ్రేస్ వెల్ నుంచి మొదలు పెడితే శాంట్నర్ వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ధాటిగా పరుగులు రాబట్టాడు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అదరగొట్టాడు. అందువల్లే దక్షిణాఫ్రికా 312 పరుల స్కోర్ చేయగలిగింది. ఇంకో రెండు లేదా మూడు ఓవర్లు గనుక ఉండి ఉంటే మ్యాచ్ స్వరూపం ఇంకొక రకంగా ఉండేది. డేవిడ్ మిల్లర్ కచ్చితంగా ఆటస్వరూపాన్ని మార్చేసేవాడు. అంత కసితో ఆడాడు. న్యూజిలాండ్ జట్టుతో దీర్ఘకాల శత్రుత్వం ఉన్నట్టు.. బంతిపై ఏదో కోపం ఉన్నట్టు బ్యాటింగ్ చేశాడు. అతడు సెంచరీ చేసినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
న్యూజిలాండ్ జట్టుకే మద్దతుగా నిలుస్తాడట..
దక్షిణాఫ్రికా జట్టు ఓటమి అనంతరం నిరాశతో పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే సౌత్ ఆఫ్రికాలో మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం న్యూజిలాండ్ – భారత్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ న్యూజిలాండ్ జట్టుకే మద్దతుగా ఉంటాడని తెలుస్తోంది. డేవిడ్ మిల్లర్ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమేముంది. ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హైబ్రిడ్ మోడ్ లో మ్యాచ్లు ఆడుతోంది. పాకిస్తాన్ తో నెలకొన్న సమస్యల వల్లే బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకుంది. ఐసీసీకి బీసీసీఐ లేఖ రాయడంతోనే టీమిండియా ఆడే మ్యాచ్లు మొత్తం దుబాయ్ లో జరుగుతున్నాయి. అయితే ఇటీవల టీమిండియా లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. ఒకవేళ ఆ మ్యాచ్లో కనుక ఓడిపోతే టీమిండియా గ్రూప్ ఏ లో రెండవ స్థానానికి పడిపోతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా జట్టు టీమ్ ఇండియాతో సెమి ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చేది. అందువల్లే దక్షిణాఫ్రికా దుబాయ్ బయలుదేరింది. అయితే అనూహ్యంగా భారత్ న్యూజిలాండ్ జట్టుతో గెలవడంతో పాకిస్తాన్ కు దక్షిణాఫ్రికా తిరిగి బయలుదేరాల్సి వచ్చింది. అయితే ఇలా ప్రయాణానికి సమయం గడిచిపోవడంతో ప్రాక్టీస్ చేయడానికి దక్షిణాఫ్రికా జట్టుకు అవకాశం లేకుండా పోయింది. అందువల్లే తాము న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయామని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్ కూడా ఉన్నాడు. తమ ఓటమికి పరోక్షంగా భారత జట్టు కారణమని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ భావిస్తున్నాడు. అందువల్లే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుకు తమ మద్దతు ఉంటుందని అతడు చెబుతున్నాడు. డేవిడ్ మిల్లర్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్లో అంత ముందు జరిగిన ట్రై సిరీస్లో ఎలాంటి ఆట తీరు ప్రదర్శించారు అందరికీ తెలుసని దెప్పి పొడుస్తున్నారు.
Also Read: న్యూజిలాండ్ జట్టుతో CT ఫైనల్.. టీమిండియాలో ఆ మ్యాజికల్ బౌలర్ ఆడేది అనుమానమే.. ఎందుకంటే?