Shubman Gill: సెంచరీ ముంగిట శుభ్ మన్ గిల్ రిటైర్డ్ హర్ట్..మళ్లీ బ్యాంటింగ్ కు వస్తాడా? నిబంధనలవీ…

మైర్లిబొన్ క్రికెట్ క్లబ్(MCC) లోని క్రికెట్ చట్టాల ప్రకారం ఒక ప్లేయర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి అనారోగ్యం గానీ,లేదా గాయం గానీ లేదా ఇంకేదైనా ప్రాబ్లం వల్ల గానీ ఆ బ్యాటర్ ని రిటైర్డ్ హర్ట్ అయినట్టు గా పరిగణిస్తారు..

Written By: Gopi, Updated On : November 15, 2023 4:44 pm

Shubman Gill:

Follow us on

Shubman Gill: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాన్ టీమ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది.ఇక ఇండియన్ టీమ్ ఓపెనర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ నాలుగు సిక్స్ లు, నాలుగు ఫోర్లు కొట్టి 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఇక అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ, శుభ్ మన్ గిల్ ఇద్దరు కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ ని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇక ఈ క్రమం లోనే గిల్ 65 బంతుల్లో మూడు సిక్స్ లు ఎనిమిది ఫోర్లు కొట్టి 79 పరుగులు చేశాడు ఇక ఆ తర్వాత గిల్ కాళ్ళ కండరాలు పట్టుకోవడం తో రిటైర్డ్ హార్ట్ గా వెను తిరిగాడు.ఇక సెంచరీ చేస్తాడని అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో గిల్ ఇలా పిచ్ నుంచి బయటకు వెళ్లిపోవడం మ్యాచ్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి చాలా బాధను కలిగించింది. రిటైర్డ్ హార్ట్ అంటే ఏంటి గిల్ మళ్లీ బ్యాటింగ్ కి రావచ్చా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

క్రికెట్‌లో రిటైర్డ్ హర్ట్ అంటే
మైర్లిబొన్ క్రికెట్ క్లబ్(MCC) లోని క్రికెట్ చట్టాల ప్రకారం ఒక ప్లేయర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి అనారోగ్యం గానీ,లేదా గాయం గానీ లేదా ఇంకేదైనా ప్రాబ్లం వల్ల గానీ ఆ బ్యాటర్ ని రిటైర్డ్ హర్ట్ అయినట్టు గా పరిగణిస్తారు…ఇక అలాంటి ప్లేయర్ మ్యాచ్ ని తను కంటిన్యూ చేయలేడు కాబట్టి ముందుగా ఆయన ఫీల్డ్ లో ఉన్న ఎంపైర్ కి చెప్పి గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక ఇలాంటి క్రమం లో రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయిన ప్లేయర్ మళ్ళీ బ్యాటింగ్ చేయవచ్చా అనే ప్రశ్న అందరిలో తలెత్తి తుంది. అలాంటి ప్లేయర్ కచ్చితంగా మళ్ళీ బ్యాటింగ్ కి రావచ్చు…

అయితే ఇందులోనే రిటైర్డ్ ఔట్ అని ఇంకో పద్దతి కూడా ఉంటుంది ఇది ఎంటి అంటే ప్లేయర్ ఆల్మోస్ట్ ఇక ఫీల్డ్ లోకి అడుగు పెట్టలేక పోతున్న క్రమంలో ఎంపైర్ అతన్ని రిటైర్డ్ ఔట్ కింద పరిగణలోకి తీసుకొని అతన్ని ఔట్ గా పరిగణిస్తారు.ఆయన మళ్ళీ ఆడటానికి కుదరదు…. ఇక రిటైర్డ్ హర్ట్ కి, రిటైర్డ్ ఔట్ కి మధ్య ఉన్న తేడా అదే రిటైర్డ్ హర్ట్ అయిన ప్లేయర్ మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి రావాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ క్రీజ్ లో ఆడుతున్న ప్లేయర్ ఔట్ అయినపుడు మాత్రమే తను ఫీల్డ్ లోకి వస్తాడు అంతే తప్ప ఆల్రెడీ ఆడుతున్న ప్లేయర్ ని వెనక్కి పంపేసి రిటైర్డ్ హర్ట్ అయిన ప్లేయర్ రావడానికి కుదరదు ఈ మ్యాచ్ లో గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యారు కాబట్టి మ్యాచ్ ముగిసెలోపు కోలుకుంటే ఆయన మళ్ళీ బ్యాటింగ్ కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇలాంటి సంఘటనలు క్రికెట్ మ్యాచ్ లో ఇంతకు ముందు కూడా చాలానే జరిగాయి….