IND vs New Zealand: గెలుపుకు, విజయానికి మధ్య తేడా ఒక్క వికెట్. 9 వికెట్లు నేలకూల్చి.. చివరి వరుసలో ఉన్న బౌలర్ల వికెట్లు తీయలేక టీమిండియా ఓడిపోయింది. న్యూజిలాండ్ చివరి వరుస బ్యాట్స్ మెన్ పోరాటం ముందు తలవంచింది. గెలుపు ముంగిట బొక్క బోర్లా పడింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్ డ్రా కావడంతో టీమిండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు.
టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టెస్ట్ సిరీస్ లోనూ ఆధిపత్యం చెలాయించింది. శ్రేయాస్ అయ్యర్ సెంచరీతోపాటు రెండో ఇన్నింగ్స్ లోనూ రాణించడంతో ప్రత్యర్థి న్యూజిలాండ్ ను కట్టడి చేసింది. అయితే చివరి రోజు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆఖరి సెషన్ లో భారత బౌలర్లు విజృంభించారు. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తిసి ఉంటే భారత్ గెలిచేదే. కానీ కివీస్ చివరి బౌలర్లు అజాజ్, రవీంద్రలు జాగ్రత్తగా ఆడుతూ టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో భారత్ తొలి టెస్టును డ్రాగా ముగించాల్సి వచ్చింది.
Also Read: జట్టులో ఉండేదెవరో తేలేది నేడే..!
రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ తలో ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. జాగ్రత్తగా చివరి వరుస బ్యాట్స్ మెన్ అజాజ్, రచిన్ ఆడుతూ టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో భారత్ తొలి టెస్టును డ్రాగా ముగించాల్సి వచ్చింది.
చివరి ఇద్దరు కివీస్ బ్యాట్స్ మెన్ కనుక పోరాడకపోయి ఉంటే.. భారత బౌలర్లు మరో వికెట్ తీసి ఉంటే టీమిండియా కథ వేరేలా ఉండేది. కానీ బ్యాడ్ లక్ టీమిండియాను వెంటాడింది. తొలి టెస్టును డ్రా చేసుకుంది.
Also Read: టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పనితీరుతో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి..?