Omicron Variant: కరోనా తన రూపాలు మార్చుకుంటోంది. కొత్త రకం వేరియంట్లుగా కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వైరస్ ఇప్పుడు వేరియంట్ల రూపంలో మరోమారు దెబ్బతీసేందుకు రెడీ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కేసులతో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం సోకుతున్న వేరియంట్ తో లక్షణాలేవీ కనిపించడం లేదని తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ గా చెబుతున్న ఇది అత్యంత ప్రాణాంతకంగా మారనుందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అయితే గొంతులో గరగర, పొడిదగ్గు, కండరాల నొప్పులతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన వారు 40 ఏళ్ల కంటే తక్కువ వారే అని వైద్యులు సూచిస్తున్నారు. కాగా ఇందులో తక్కువ మందికి మాత్రమే వ్యాక్సినేషన్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ లక్షణాలు కలిగిన వారు ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
దీనికి బీ1.1.529 అనే పేరు ఖరారు చేశారు. ఇది భయంకరమైన వేరియంట్ గా మాత్రం గుర్తించారు. వ్యాక్సినేషన్ చేయించుకున్న వారికి ఈ వైరస్ సోకుతుందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. దక్షిణాఫ్రికాలో కాలేజీలు, యూనివర్సిటీల్లోనే ఈ కేసులు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దీని తీవ్రత రెండు వారాల్లోనే పెరిగిపోయింది.
Also Read: ప్రపంచాన్ని మరోసారి కబళించడానికి వస్తున్న కరోనా
కరోనా ప్రభావంతో ప్రపంచం మొత్తం భారీ మూల్యాన్నే చెల్లించింది. ఏ ఒక్క దేశం మినహాయింపు కాకుండా అన్ని దేశాలు వైరస్ ధాటికి కుదేలైపోయాయి. ఇప్పుడు కొత్త వేరియంట్ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: ప్రజలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాక్!