YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. గంగాధర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు ఈ కేసులో నిందితులుగా చేరే అవకాశం ఏర్పడింది. దీంతో వివేకా కేసులో తమను బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలతో కేసు ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు. సీఐ శ్రీరామ్ తనను వేధించారని గంగాధర్ రెడ్డి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
గంగాధర్ రెడ్డి తనకు ప్రాణభయం ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కోరడం విధితమే. దీంతో వివేకా హత్య కేసులో ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో తెలియడం లేదు. ఇప్పటికే పలువురు కేసులో అప్రూవర్ గా మారడంతో కేసు కీలక మలుపులకు కారణమవుతోంది.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అతడి అరెస్ట్ ఖాయం
ఇప్పటికే ప్రతిపక్షాలు జగన్ ను సైతం టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్న క్రమంలో మరోమారు ప్రభుత్వంపైనే ఎక్కువ మంది ఆరోపణలకు దిగుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి బంధువులే హత్య చేశారనే విషయం పలుమార్లు చెబుతున్నా ఆ దిశగా దర్యాప్తు జరగడం లేదు.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్
దీంతోనే కేసు చాలా రోజులుగా పెండింగులో ఉంటోంది. ఎటూ తేలడం లేదు. నిందితులు పెరుగుతున్నా హత్య కేసు ఓ ముగింపుకు నోచుకోవడం లేదు. రోజుల తరబడి విచారణ కొనసాగుతూనే ఉంది. అసలు దోషులను వదిలేసి కేసుతో సంబంధం లేని వారిని పట్టుకున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏ మేరకు స్పందించి కేసును కొలిక్కి తెస్తుందో వేచి చూడాల్సిందే.