IND vs NZ : సమం చేస్తారా? అప్పగిస్తారా?; నేడు భారత్, కివీస్ రెండో టీ20

IND vs NZ : రెండు వైట్ వాష్ ల తర్వాత.. టీం ఇండియా కు మొదటి టీ 20 మ్యాచ్ లో కివీస్ ఓటమి రుచి చూపించింది. కివీస్ ఓడించింది అనే కంటే భారత్ చేజేతులా ఓడింది అనడం సబబు. కేవలం 15 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు నేలకూలాయి అంటే బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. వీర విహారం చేస్తాడు అనుకున్న రాహుల్ త్రిపాఠి, మెరుపులు మెరిపిస్తాడు అనుకున్న ఇషాన్ కిషన్, […]

Written By: Bhaskar, Updated On : January 29, 2023 3:48 pm
Follow us on

IND vs NZ : రెండు వైట్ వాష్ ల తర్వాత.. టీం ఇండియా కు మొదటి టీ 20 మ్యాచ్ లో కివీస్ ఓటమి రుచి చూపించింది. కివీస్ ఓడించింది అనే కంటే భారత్ చేజేతులా ఓడింది అనడం సబబు. కేవలం 15 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు నేలకూలాయి అంటే బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. వీర విహారం చేస్తాడు అనుకున్న రాహుల్ త్రిపాఠి, మెరుపులు మెరిపిస్తాడు అనుకున్న ఇషాన్ కిషన్, సూపర్ ఫామ్ లో ఉన్న గిల్.. ఇలా వరుసగా ఔట్ అయ్యారు.. ఫలితంగా కివీస్ మ్యాచ్ పై పట్టు బిగించేలా చేశారు. ఇక ఆదివారం లక్నోలో రాత్రి 7:00 నుంచి రెండో టి20 జరగనుంది.. మరి ఈ మ్యాచ్ లో గెలిచి సీరిస్ సమం చేస్తుందా, ఓడిపోయి న్యూజిలాండ్ అప్పగిస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

మొదటి టీ 20 లో 15 పరుగులకే కోల్పోయిన టీమిండియా…మిడిల్ అండతో కాస్త నిలబడగలిగింది… వాస్తవానికి తుఫాన్ ఆటతీరుతో రెచ్చిపోయే సూర్యకుమార్ అవుట్ కావడం, కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారీ ఇన్నింగ్స్ ఆట లేకపోవడం, మిగతా బ్యాట్స్మెన్ లో వాషింగ్టన్ సుందర్ మినహా మిగతావారు రాణించలేకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. దీంతో మరోసారి జట్టు కూర్పుపై చర్చ మొదలైంది.. మొన్నటిదాకా యువకులకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వారే.. ఈ ఓటమితో మౌనాన్ని ఆశ్రయించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్ ధారాళంగా పరుగులు ఇస్తున్నారు.. మరీ ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్ అయితే చివరి ఓవర్లో 27 పరుగులు ఇవ్వడం అతడి అనుభవ రాహిత్యానికి ప్రధాన కారణం.

వన్డేల్లో మంచి ఫామ్ ప్రదర్శించిన గిల్… పొట్టి ఫార్మాట్లో తేలిపోతున్నాడు.. కిషన్, దీపక్ నుంచి హిట్టింగ్ కరువైంది.. పరిస్థితుల్లో ఇషాన్,హుడా ఆట తీరును మేనేజ్మెంట్ సునిశితంగా పరిశీలించే అవకాశం ఉంది..అటు సుందర్ బ్యాట్, బంతితో రాణిస్తున్నాడు. టీమిండియా కు ఇది సానుకూల అంశంగా మారింది. ఇక సిరీస్ ను సమం చేయాలంటే మాత్రం సూర్య, సుందర్ ధనాధన్ ఆట ఆడాలి. మరోవైపు టి20 లో తొలి మ్యాచ్ లోనే నెగ్గడం న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.. ఇదే జోష్ తో సిరీస్ ను పట్టేయాలని శాంట్నర్ ఉవ్విళ్ళురుతున్నది. బ్యాటింగ్ లో కాన్వే, మిచెల్ పైనే టీం ఆధారపడి ఉంది.

జట్ల అంచనా ఇలా

భారత్: ఇషాన్, గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కులదీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్,అర్ష్ దీప్ సింగ్.

న్యూజిలాండ్;
ఫిన్ అలెన్, డెవాన్, కాన్వే, చాప్ మన్, డారిల్ మిచెల్, ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మైకేల్ బ్రేస్ వెల్, డఫీ, సోది, ఫెర్గు సన్, టిక్నర్.