Homeట్రెండింగ్ న్యూస్Jalore Couple: ఓ ప్రేమజంట చేసిన పనికి కలెక్టర్ కంగారు పడ్డారు.. ఎస్పీ వణికి పోయారు.....

Jalore Couple: ఓ ప్రేమజంట చేసిన పనికి కలెక్టర్ కంగారు పడ్డారు.. ఎస్పీ వణికి పోయారు.. శంభో శివ శంభో సినిమాకు మించిన స్టోరీ ఇది..

Jalore Couple: ఓ యువతీయువకుడు ప్రేమించుకుంటారు. వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతారు. పెళ్లి చేసుకోవడానికి అడ్డంకులు సృష్టిస్తారు. ఇలాంటి సమయంలోనే స్నేహితులు ఎంట్రీ ఇస్తారు. వారిద్దరి పెళ్లి ఘనంగా చేస్తారు. ఆ తర్వాత పెద్దల నుంచి ఇబ్బందులు.. బెదిరింపులు.. వాటిని ఎదుర్కొనేందుకు లభించే స్నేహితుల సహకారాలు.. ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి సంఘటన కాస్త వెరైటీ ట్విస్ట్ లతో రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాకపోతే ఈ మొత్తం ఎపిసోడ్ లో అటు కలెక్టర్ కార్యాలయం షేక్ అయింది. ఇటు ఎస్పీ కార్యాలయం వణికిపోయింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

రాజస్థాన్ రాష్ట్రంలో జలోర్ ప్రాంతానికి చెందిన ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. వారిద్దరి వ్యవహారం ఇంట్లో తెలియడంతో పెద్దలు మందలించారు. అయినప్పటికీ ఆ యువతీ యువకుడు చాటుమాటుగా కలుసుకుంటూనే ఉన్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ఆ యువతికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించేందుకు వెళ్లారు. ఈ విషయం ఆమె ప్రేమికుడికి తెలిసింది. ఇంకేముంది ఇంట్లో నుంచి ఆ యువతి యువకుడు వెళ్ళిపోయారు. స్థానికంగా ఉన్న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయానికి వెళుతుండగా.. ఈ విషయం ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు ఆ యువతి యువకుడిని వెంబడించారు. ఆ యువతి యువకుడిని చుట్టుముట్టారు. ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఇది గమనించిన పోలీసులు ఆ యువతి కుటుంబ సభ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అటు పోలీసులు, ఇటు కుటుంబ సభ్యుల మధ్య పెనుగులాట జరగడంతో.. యువతి, యువకుడు వారి నుంచి తప్పించుకున్నారు. ఎస్పీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. ఇది గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు పరుగు లంకించుకున్నారు. పాల్గొన్న ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆగి యువతీ యువకుడు.. తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇదే సమయంలో ఫిర్యాదు కూడా చేయడంతో.. పోలీసులు వారిద్దరినీ తమ అదుపులో ఉంచుకున్నారు.

కలకలం

వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ.. ఆర్థిక అంతరాల వల్ల ఆ యువతిని ఆ యువకుడికి ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందువల్లే వారిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ఆ యువతీ యువకుడు ముందుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడంతో.. అక్కడే విధుల్లో ఉన్న కలెక్టర్ వెంటనే స్పందించారు. అక్కడి పరిస్థితిని కిందిస్థాయి ఉద్యోగుల ద్వారా తెలుసుకున్నారు. ఆ యువతీ కుటుంబ సభ్యులు పెద్దపెట్టున రావడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం నెలకొంది. వివిధ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలానికి వచ్చినవారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తమను ఏమైనా చేస్తారని భయంతో దూరంగా పరుగులు తీశారు. ఒకానొక దశలో కలెక్టర్ కూడా ఆ యువతి కుటుంబ సభ్యులు చేసిన హడావిడి చూసి ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.

ఎస్పీ కార్యాలయంలో..

ఎస్పీ కార్యాలయంలోనూ ఇదే తరహా హడావిడి చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆ సమయంలో ఓ కేసు విచారణ లో ఎస్పీ తల మునకలై ఉన్నారు. దీంతో ఆయన కూడా ఒక్కసారిగా బయటికి వచ్చారు. ఆ అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఎస్పీ కార్యాలయంలోనూ రచ్చ రచ్చ చేయడంతో.. ఎస్పీ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జరిగిన విషయాన్ని ఇరుపక్షాల ద్వారా తెలుసుకున్నారు. యువతీ యువకులిద్దరూ మేజర్లు కావడంతో.. తాము రక్షణ కల్పిస్తామని ఎస్పీ చెప్పారు.. అయితే ఆ అమ్మాయి తరఫున వారు ఆందోళన చేయడంతో.. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆ యువతి భయపడిపోయి తన తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్యను తన నుంచి దూరం చేశారని ఆ యువతి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. కాగా, అబ్బాయి కంటే అమ్మాయి వాళ్ళు ఆర్థికంగా స్థితి మంతులు కావడంతోనే ఈ సంబంధాన్ని ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయం రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular