India Vs Ireland: ఐర్లాండ్ పై విజయం.. పాక్ మ్యాచ్ కు ముందు భారత్ కు భలే ప్రాక్టీస్ దొరికింది..

టాస్ గెలిచిన భారత్ ఐర్లాండ్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. న్యూయార్క్ మైదానం ఆస్థిరమైనది కావడంతో బ్యాటింగ్ చేసేందుకు ఐర్లాండ్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు.. హార్దిక్ పాండ్యా (3/27), బుమ్రా(2/6), అర్ష్ దీప్ (2/35), సిరాజ్ (1/13) మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ 16 ఓవర్లలోనే 96 పరుగులకు చాప చుట్టేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 6, 2024 8:31 am

India Vs Ireland

Follow us on

India Vs Ireland: టి20 ప్రపంచ కప్ లో రోహిత్ సేన శుభారంభం చేసింది.. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టింది.. బౌలర్లు ఐర్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. దూకుడైన ఆటతో బ్యాటర్లు ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా మ్యాచ్ మొత్తం పూర్తి ఏకపక్షంగా సాగింది.. నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఐర్లాండ్ ను భారత్ ఆల్ అవుట్ చేసింది.. 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది.

టాస్ గెలిచిన భారత్ ఐర్లాండ్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. న్యూయార్క్ మైదానం ఆస్థిరమైనది కావడంతో బ్యాటింగ్ చేసేందుకు ఐర్లాండ్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు.. హార్దిక్ పాండ్యా (3/27), బుమ్రా(2/6), అర్ష్ దీప్ (2/35), సిరాజ్ (1/13) మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ 16 ఓవర్లలోనే 96 పరుగులకు చాప చుట్టేసింది. ప్రాజెక్టులో డెలాని (26; 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.. ఈ లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (52; 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), పంత్(36* 26 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 12.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టును టీమ్ ఇండియా బౌలర్లు వణికించారు. న్యూయార్క్ మైదానంపై తేమ ఉండడంతో భారత పేస్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, సిరాజ్ పదునైన బంతులు వేస్తూ ఐర్లాండ్ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వాతావరణం మబ్బు పట్టి ఉండడంతో.. టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయం సరైనదే అని చెబుతూ.. బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీశారు..అర్ష్ దీప్ ఓపెనర్లు స్టిర్లింగ్ (2), బాల్ బిర్ని(5) ని ఔట్ చేసి ఐర్లాండ్ పతనాన్ని శాసించాడు. ఇక అప్పటి నుంచి వికెట్ల పతనం క్రమం తప్పకుండా సాగింది. హార్దిక్, బుమ్రా, సిరాజ్ పేస్ బౌలింగ్ తో చెలరేగడంతో ఐర్లాండ్ బౌలర్లు ఏ దశలోనూ ప్రతిఘటించలేకపోయారు. చివర్లో డిలాని(26), జోష్ లిటిల్ (14), వైట్ (2*) పరుగులు చేయడంతో.. ఐర్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

లక్ష్య చేదనను భారత్ ధాటిగానే ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన సహజ శైలిలో ఆడాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (1) పూర్తిగా నిరాశపరిచాడు. బహుశా అమెరికన్ పరిస్థితులకు విరాట్ ఇంకా అలవాటు పడలేదనుకుంటా. విరాట్ అవుట్ అయిన తర్వాత రెండవ బ్యాటర్ గా రిషబ్ పంత్ మైదానంలోకి వచ్చాడు. వీరిద్దరూ భారత స్కోర్ బోర్డ్ ను పర్వాలేదనే స్థాయిలోనే పరుగులు పెట్టించారు. ఈ దశలో ఆర్డర్ సెంచరీ సాధించిన రోహిత్.. రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (2) నిరాశపరచాడు. అయినప్పటికీ పంత్ ధాటిగా ఆడి.. శివం దూబే(0)తో కలిసి భారత జట్టును విజయతీరాలకు మళ్ళించాడు. కాగా, ఈ మ్యాచ్ ద్వారా భారత క్రీడాకారులకు భలే ప్రాక్టీస్ దొరికింది. అమెరికన్ మైదానాలకు అలవాటు పడేందుకు అవకాశం లభించింది.