https://oktelugu.com/

Gold Rates Today: మరోసారి తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి..వెండి ఏకంగా రూ.2500 మేర తగ్గింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. అంతకుముందు వరుసగా తగ్గిన బంగారం ధరలు మూడు రోజులగా పెరిగాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 6, 2024 / 08:20 AM IST

    Gold Price Today

    Follow us on

    Gold Price Today: బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి..వెండి ఏకంగా రూ.2500 మేర తగ్గింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. అంతకుముందు వరుసగా తగ్గిన బంగారం ధరలు మూడు రోజులగా పెరిగాయి. ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. దేశీయంగా గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 6న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,650 గా ఉంది. జూన్ 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,800తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి బుధవారంతో పోలిస్తే గురువారం రూ.200 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,800గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,600 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,650 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,250 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,350తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,650తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,650తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గుతున్నాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.91,600గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం రూ.2500 మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.91,600గా ఉంది. ముంబైలో రూ.91,600, చెన్నైలో రూ.96,100 బెంగుళూరులో 91,800, హైదరాబాద్ లో రూ. 96,100 తో విక్రయిస్తున్నారు.